హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : బయటపడుతున్న చికోటీ చీకటి సామ్రాజ్యం.. తెర వెనుక తారలు, నేతలు

Crime news : బయటపడుతున్న చికోటీ చీకటి సామ్రాజ్యం.. తెర వెనుక తారలు, నేతలు

చికోటి ప్రవీణ్(file)

చికోటి ప్రవీణ్(file)

Crime news: బయటి ప్రపంచానికి తెలిసి అతను ఓ సాధారణ వ్యక్తి. కాని పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన ఓ ఆర్ధికవేత్త, హవాలా మార్గం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును దేశం దాటించారనే అనుమానాలు, ఆరోపణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రైడ్ చేస్తే అతని గుట్టంతా రట్టైపోయింది.

ఇంకా చదవండి ...

బయటి ప్రపంచానికి తెలిసి అతను ఓ సాధారణ వ్యక్తి. కాని పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన ఓ ఆర్ధికవేత్త, హవాలా (Hawala)మార్గం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును దేశం దాటించారనే అనుమానాలు, ఆరోపణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) రైడ్ చేస్తే అతని గుట్టంతా రట్టైపోయింది. ఒక్కడే కాదు అతని వెనుక రాజకీయ, సినీ ప్రముఖుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్‌కుమార్(Chekoti Praveen Kumar) హైదరాబాద్‌ (Hyderabad) అడ్డాగా చేసుకొని ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగించినట్లుగా భావిస్తోంది ఈడీ. ఇందులో భాగంగానే చికోటి ప్రవీణ్‌కుమార్‌తో పాటు అతని పార్టనర్ మాధవరెడ్డి (Madhav Reddy)ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలతో పాటు ల్యాప్‌టాప్‌లో ఉన్న ఇన్పర్మేషన్‌ని సేకరిస్తున్నారు. బిగ్‌ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం బాలీవుడ్‌ తారలకు సైతం పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పినట్లుగా రాబట్టారు ఈడీ అధికారులు.

దేశముదురు..?

ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీలోని చికోటి ప్రవీణ్‌ కుమార్‌కు చెందిన ఇంటిపై దాడులు నిర్వహించారు. అతడ్ని అదుపులోకి తీసుకోవడంతో పాటుగా ప్రవీణ్‌ మొబైల్‌తోపాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన డాక్యుమెంట్లతోపాటు హార్డ్‌డిస్క్‌ నుంచి రిట్రీవ్‌ చేయాల్సిన అంశాల ఆధారంగా దర్యాప్తు చేశారు. నాలుగు బ్యాంక్‌ అకౌంట్లను గుర్తించారు. చీకోటి ప్రవీణ్‌కుమార్‌ ఆర్దిక లావాదేవీల వ్యవహారంలో 10మంది సినీ ప్రముఖులతో పాటు 20మంది రాజీకీయ ప్రముఖులు ఉన్నట్లుగా తేలింది. వారికి నోటీసులు ఇవ్వనున్నారు ఈడీ అధికారులు.

హవాలా రూపంలో డబ్బు తరలింపు..

హవాలా మార్గంలో సొమ్ము తరలించేందుకు చీకోటితో మరో నలుగురు భాగస్వాములుగా ఉన్నట్టు ఈడీ ఆధారాలు సేకరించిందని సమాచారం. వాళ్లలో ఇద్దరు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు చెందిన వాళ్లు ఇద్దరూ హవాలా ఏజెంట్లుగా వ్యవహరించారని తెలుస్తోంది. వీళ్లంతా కలిసే నేపాల్, శ్రీలంక, ఇండోనేసియానే కాకుండా సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్‌ దేశాల్లోనూ ప్రవీణ్‌ క్యాసినోలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే దాడుల విషయంపై చీకోటి ప్రవీణ్‌ని ప్రశ్నిస్తే గోవాలో, నేపాల్‌లో చట్టపరంగానే తాను క్యాసినోలు నిర్వహించానని చెప్పారు. ఈడీ నోటీసులపై సోమవారం విచారణకు హాజరై వాళ్ల డౌట్స్ క్లియర్ చేస్తానని తెలిపారు.కేసులో అనేక మందికి లింకులు..

ఓవైపు ఈడీ అధికారులు చీకోటి చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. ఇందులో భాగంగానే కడ్తాల్‌ సమీపంలో 20ఎకరాల్లో నిర్మించుకున్న చీకోటి ఫామ్‌ హౌస్‌ను గుర్తించారు. అప్పుడప్పుడు రిలాక్స్ అవడానికి మాత్రమే అక్కడికి వెళ్తుంటారని తేలింది. సిటీలో తనకు తెలిసిన చాలా మంది బిగ్‌షాట్‌లు, వీవీఐపీలు సైతం ఇక్కడ బస చేయడానికి ఆశ్రయం కల్పించినట్లుగా చీకోటి వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా రాబట్టారు. ఇక వైల్డ్ లైఫ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఫామ్‌హౌస్‌లో పెంపుడు జంతువులతో పాటు ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన పక్షులు, బల్లులు, పాములు ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే వాటిని తీసుకొచ్చి ఇలా ఫామ్‌హౌస్‌లో పెట్టడం నేరమని తెలిపారు. ఒకవేళ పర్మిషన్ ఉంటే వదిలేస్తామని లేకపోతే చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ ఫామ్‌హౌస్‌ దగ్గర ఉంచి పక్షలు, రెప్టైల్స్ విషయంలో పర్మిషన్లు లేవని తెలిస్తే భారీ జరిమానాతో పాటు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ కింద కేసు బుక్ చేస్తే మూడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Telangana : తెప్పపై వాగు దాటిన లేడీ ఎమ్మెల్యే .. అందుకోసం అంత రిస్క్ చేశారా..!పేరు మోసిన పెద్దలకు వాటాలు..

క్యాసినో కేంద్రాల నిర్వాహణ పేరుతో డబ్బును డాలర్ల రూపంలో విదేశాలకు పంపడం, భారీగా జూదరుల కోసమేనని భావిస్తున్నారు ఈడీ అధికారులు. ఈమొత్తం వ్యవహారంలో విమాన టికెట్లు, క్యాసినో ఆడేందుకు డబ్బు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి అప్పజెప్పాలి అన్న కీలక విషయాలను ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. చీకోటి ఇంట్లో ఓ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ భూమి పత్రాలతో పాటు సినీ ప్రముఖుల నంబర్లకు లొకేషన్‌ మ్యాప్‌లుండటంపై అధికారులు కూపీ లాగుతున్నారు.

క్లైమాక్స్‌ ఎలా ఉంటుందో..?

వీళ్లే కాదు బిగ్‌ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌కు రూ.కోటి, అమీషా పటేల్‌కు 80 లక్షలు, ఈషారెబ్బకు 40 లక్షలు,గోవిందకు రూ.50 లక్షలు, డింపుల్‌ హయతీకి రూ.40 లక్షలు, గణేష్‌ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషకం కింద ఇచ్చినట్టు ఈడీకి అందిన ఆధారాల ప్రకారం కూపీ లాగుతున్నారు. అయితే ఇదంతా గతేడాది జూన్‌లో నేపాల్‌లోని క్యాసినోలో నాలుగు రోజుల ఎంటర్‌టైనమెంట్ ప్రోగ్రామ్‌ కోసం చీకోటి ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana crime news

ఉత్తమ కథలు