కాలం మారుతుంది. సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా కష్టపడి మంచి స్థాయిలో ఉండాల్సిన యువత డ్రగ్స్ కు బానిసలా తయారవుతున్నారు. మత్తుకు అలవాటు పడి యువత జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. వేడుకల మాటున ఎంజాయ్ కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కళ్లు గప్పి గంజాయిని వాడుతున్నారు యువత. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు బాగానే ఉంటున్నారనే భ్రమలో ఉండిపోతున్నారు. వీరిని ఆసరాగా చేసుకుంటున్న అంతరాష్ట్ర ముఠాలు కాసుల కోసం గంజాయిని ఎక్కడికంటే అక్కడికి తరలిస్తూ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడడం కలకలం రేపుతోంది.
అంతర్జాతీయ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులు హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు పక్కా పథకం ప్రకారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 8 కిలోల డ్రగ్స్ (Drugs) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. అయితే న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మొన్నటి వరకు పట్టణాల్లో నేడు పల్లెల్లో కూడా..
కాగా ఈ డ్రగ్స్ దందా ఇన్ని రోజులు కేవలం పట్టణాలకే పరిమితమయ్యేది. ఆయా పట్టణాలకు సరఫరా చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగేది. ఇక ఇప్పుడు పల్లెల్లోనూ గంజాయి గుప్పుమంటుంది. చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడి జీవితాలను అంధకార మయం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుంది. పోలీసుల కళ్లు గప్పి ఆయా ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు.
కాగా కొన్నిరోజుల క్రితం కూడా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. భాగ్యనగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నలుగురు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారీగా తెలుస్తుంది. వీరు రాజస్థాన్ నుండే డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్ (Hyderabad) వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. నిందితుల నుండి ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక వరుస డ్రగ్స్ ముఠా అరెస్టులతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం జల్లెడ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Drugs, Hyderabad crime, Telangana, Telangana crime