Home /News /telangana /

HYDERABAD DOCTORS LEFT NEGLECTED HIGH COURT CHIEF JUSTICE UJJAL BHUYAN TO ACT RESPONSIBLY SNR

Hyderabad: నిర్లక్ష్యం వల్లే వైద్యవ్యవస్థకు చెడ్డపేరు .. డాక్టర్లు మరింత బాధ్యతగా పనిచేయాలి: సీజే ఉజ్జల్‌ భూయాన్

(చీఫ్‌ జస్టిస్ సూచనలు)

(చీఫ్‌ జస్టిస్ సూచనలు)

Hyderabad: వైద్యసేవల పట్ల డాక్టర్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ సూచించారు. డాక్టర్లను ప్రత్యక్షదైవంగా అభివర్ణించిన చీఫ్‌ జస్టిస్..వైద్యవృత్తిలో ఉన్న వాళ్లు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలన్నారు. కొందరి వల్లే వైద్య వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు ఉజ్జల్‌ భూయాన్.

ఇంకా చదవండి ...
వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హితవు పలికారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎంఎ బంజారాహిల్స్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన క్లినికల్ ఆంకాలజీ, ప్రాక్టీస్, ద ఫండమెంటల్స్, ద బేసిక్స్ అండ్ ఎసెన్షియల్స్ (Clinical Oncology, Practice,the Fundamentals, The Basics and The Essentials)అనే అంశంపై హోటల్ తాజ్ బంజారా(Hotel Taj Banjara)లో సదస్సు జరిగింది. ఈకార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌(High Court Chief Justice Ujjal Bhuyan) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసదస్సులోనే వైద్యులు, వైద్య వృత్తికి సంబంధించిన విషయాలపై ఆయన మాట్లాడారు.

డాక్టర్లు దేవుళ్లతో సమానం..
వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదన్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్ డాక్టర్లను ప్రత్యక్షదైవాలుగా సంభోదించారు. కోవిడ్‌ సమయంలో వైద్యులు ప్రాణాల్ని పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. కేవలం కొందరు వ్యక్తుల వల్లే వైద్య వ్యవస్థకు కళంకం వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. వైద్యవృత్తిని, వైద్యసేవను వ్యాపార ధోరణితో చూడటం వల్లే నిర్లక్ష్యం పెరిగిపోయి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.వైద్యవృత్తికి కళంకం తేవద్దు..
ఎంతో గౌరవప్రదమైన వైద్యసేవలో ఉన్న వాళ్లు నిర్లక్ష్యమనే జాడ్యాన్ని పక్కనపెట్టి మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సదస్సులోనే డాక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యం వల్ల పోతున్న ప్రాణాలు పోయాయని మృతుల బంధువులు కోపంలో డాక్టర్లపై దాడులు చేయడం ఆసుపత్రులు,వైద్యులపై సివిల్, క్రిమినల్‌ కేసులు పెట్టడం చూస్తునే ఉన్నామన్నారు ఉజ్జల్ భూయాన్. అయితే ఇందులో వారి ఆవేదనను కూడా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు చీఫ్‌ జస్టిస్ట్. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూనే కనీస సౌకర్యాలు కల్పించపోవడం శోచనీయన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సీజన్, వెంటిలెటర్స్, బ్లడ్ బ్యాంక్ వంటి మౌలిక సధుపాయాలు లేక రోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇదంతా మెడికల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుందన్న ఆయన దీనికి కూడా డాక్టర్లే బలవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్.

ఇది చదవండి: విద్యార్థుల తలిదండ్రులు ఇది గమనించరూ: పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరిమరింత బాధ్యతగా వ్యవహరించాలి..
ఈసదస్సుకు రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్యతో పాటు టీఆర్‌ఎస్‌ నేత వేణుగోపాలచారి సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. ఈసందర్భంగా ఆంకాలజీలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ ఆర్‌ కృష్ణయ్య. మరిన్ని పరిశోధనలు జరిగి మహమ్మారిని శాశ్వతంగా పారద్రోలేందుకు మందులు రావాలని ఆకాంక్షించారు. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని పెరుగుతున్న సాంకేతక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి. డాక్టర్ల సేవలను గుర్తించాలని ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానిపై క్షుణ్నంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్లను నిందితులుగా చూడవద్దని కోరారు. డాక్టర్లపై దాడుల నివారణకు మరింత కట్టుదిట్టమైన చట్టాలు రావాలని కోరారు డాక్టర్ ప్రభుకుమార్ కోరారు. ఈ సదస్సులో డాక్టర్ పీఎస్ దత్తాత్రేయ క్యాన్సర్ కారకాలు... నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని గురించి వివరించారు.

ఇది చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. అలర్టయిన టీఆర్ఎస్.. ఆ జాబితాలో ఉన్న వారిపై దృష్టి


Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు