అమానవీయం : కరోనాతో నిండు గర్భిణి , ఆపరేషన్‌కు భయపడుతున్న వైద్యులు

కరోనా కష్లాటు

కరోనాతో ఓ నిండు గర్భిణి ప్రసవవేదన పడుతోంది..వైద్యులు ముందుకు రాక, ఇతర ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేక సతమవుతున్నారు. దీంతో వైద్యాధికారులు మాత్రం వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేయిస్తామని చెబుతున్నారు

  • Share this:
కరోనా సెకండ్ వేవ్ కష్టాలు మళ్లి మొదలయ్యాయి. కరోనాతో బాధపడుతున్న రోగులకు మళ్లి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో వారికి వైద్య సదుపాయాలు అందించేందుకు గ్రామాల్లోని డాక్టర్లు ముందుకురాని పరిస్థితి నెలకోంది. దీంతో వారిపరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.. ఈ నేపథ్యంలోనే ఆదిబాలాబాద్ జిల్లాలో ఓ నిండుగర్బిణికి చేదు అనుభవం ఏదురవుతోంది. కరోనా పేరుతో అక్కడి ప్రభుత్వ వైద్యులు శస్త్ర్ర చికిత్సకు నిరాకించారు. మరోవైపు అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆ కుటుంబానికి ఆర్ధిక స్థోమత లేని దయనీయ స్థితిలో ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలోని బీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం రెండు రోజుల క్రితం రిమ్స్ ఆసుపత్రికి చేరింది. అయితే సాధరణ ప్రసవం కాకపోవడంతో ఆమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అయితే ఆపరేషన్‌కు ముందు కరోనా టెస్ట్ చేయడంతో గర్భిణికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు వెనకంజవేస్తున్నారు. దీంతో ఆపరేషన్ నిలిచిపోగా...మరోవైపు హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అంతదూరం రావడానికి వారికి ఆర్థిక స్థోమత కూడ లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రసవవేదన పడుతుంది. అయితే ఇదే విషయమై ఆసుపత్రి సూపరిండెంట్ మాత్రం వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.
Published by:yveerash yveerash
First published: