(Balakrishna, News 18 telugu, Hyderabad)
హైదరాబాద్ మహానగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్దం అయింది. 2023కు స్వాగతం పలికేందుకు రిసార్టులు, క్లబ్లులు, హోటళ్లు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీరు ఓ లుక్కేయండి..
ఓం కన్వెన్షన్ నార్సింగి
నార్సింగిలోని ఓం కన్వెన్షన్ లో న్యూ ఇయర్ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటే భారీగానే చెల్లించాల్సి ఉంది. గోల్డ్ ప్యాకేజీలో ఆహారం, మందు కలపి రూ.75,000, ప్లాటినంలో రూ.1,25,000, డైమండ్ ప్యాకేజీలో రూ.2,50,000 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ప్యాకేజీల్లో ఆహారం, పానీయాలు ఉచితం.
నొవాటెల్ హోటల్ లో ఇలా..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్ న్యూ ఇయర్ 2023 వేడుకలకు సిద్దం అయింది. అన్ని వయసుల వారిని ఇక్కడ అనుమతిస్తారు. స్టాగ్ ఫీమేల్ ఎంట్రీకి రూ.2,499 ఖర్చవుతుంది. క్యాబాన్ బుక్ చేసుకుంటే రూ.1,19,999 అవుతుంది. ఇక జంటలకు ప్రవేశ ధర రూ.19,999గా నిర్ణయించారు. నొవాటెల్ హోటళ్లో 1200 మంది న్యూ ఇయర్ వేడుకలకు హాజరవుతారని అంచనా.
బేగంపేట కంట్రీ క్లబ్ లో..
హైదరాబాద్ నగరంతో 3 దశాబ్దాల అనుబంధం ఉన్న కంట్రీ క్లబ్ నూతన సంవత్సర వేడుకలకు సిద్దం అయింది. ఇక్కడ ప్రముఖ నటి స్నేహా గుప్తా వేడుకలను వేడెక్కించనుంది. కంట్రీ క్లబ్ లో వేడుకలకు నగరంలో చాలా మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
అమ్నీషియా స్కైబార్ మాదాపూర్ లోని అమ్నీసియా స్కైబార్ నూతన సంవత్సరం వేడుకలకు సిద్దం అయింది.
ఎస్ కన్వెన్షన్ హాల్..
మాదాపూర్ లోని ఎస్ కన్వెన్షన్ హాల్ నూతన సంవత్సర వేడుకలకు సిద్దమైంది. ఇక్కడ వినోదం, పానీయాలు అందిస్తారు. ఫ్యామిలీలతో హాజరు కావచ్చు. యువకులు, అమ్మాయిలు, జంటలు, పిల్లలు ఇలా అందరినీ అనుమతిస్తారు.
గచ్చిబౌలి స్టేడియం..
గచ్చిబౌలి స్టేడియం న్యూ ఇయర్ వేడుకలకు సిద్దం అయింది. నో పాజ్ పార్టీలో డీజే సాన్, ఆర్యన్ గాలా పొల్గొంటారు.
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఇలా..
హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైంది. ప్రపంచంలోనే ఉత్తమమైన కళాకారులను రప్పిస్తున్నారు. స్కై హై వినోదం అందించనున్నారు.
రిసార్టుల్లో న్యూ ఇయర్ వేడుకలు..
జంట నగరాల సమీపంలో వందలాది రిసార్టులు న్యూ ఇయర్ వేడుకలకు సిద్దం అయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు, నగరం సమీపంలోని వందలాది రిసార్టులు, రెస్టారెంట్లు, హోటళ్లు న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పడానికి సిద్దం అయ్యాయి.
పోలీసుల ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా పెట్టారు. నిషేధిత మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. బార్లు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంటాయి. మందు కొట్టి వాహనాలు నడుపుతూ దొరికిపోతే రూ.10వేల జరిమానా తప్పదని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold bars, Hyderabad, New Year 2023, Telangana