హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: రాత్రి ప‌ది గంటల తర్వాత హైద‌రాబాదీలు స్విగ్గీలో ఏం ఆర్డ‌ర్ పెడుతున్నారో తెలుసా..?

Hyderabad: రాత్రి ప‌ది గంటల తర్వాత హైద‌రాబాదీలు స్విగ్గీలో ఏం ఆర్డ‌ర్ పెడుతున్నారో తెలుసా..?

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Hyderabad: స్విగ్గీ తాజాగా విడుద‌ల చేసిన డేటాలో దేశంలోని అన్ని న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు త‌మ యాప్‌లో ఎక్కువగా వేటిని బుక్ చేస్తున్నారనే వివరాలను విడుదల చేసింది. ముఖ్యంగా హైద‌రాబాదీలు రాత్రి పది గంటలు దాటిన తర్వాత స్విగ్గీలో ఎక్కువ‌గా వేటిని బుక్ చేస్తున్నారో కూడా వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

ఆన్‌లైన్‌ సర్వీసులు(Online services)అందుబాటులోకి వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయినవి ఫుడ్‌ డోర్‌ డెలవరీ యాప్స్. అందులో స్విగ్గీ(Swiggy)ముఖ్యంగా అందరికి రోజువారి జీవితంలో భాగ‌మైపోయింది. స్విగ్గీ తాజాగా విడుద‌ల చేసిన డేటాలో దేశంలోని అన్ని న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు త‌మ యాప్‌లో ఎక్కువగా వేటిని బుక్ చేస్తున్నారనే వివరాలను విడుదల చేసింది. దేశంలోని ప్రధాన నగరాలు, మెట్రోనగరాల్లో స్విగ్గీ యాప్‌ను విస్తృతంగానే ఉపయోగిస్తున్నారని తేలింది. అయితే స్విగ్గీ యాప్‌లో ఏం ఆర్డర్(Order)చేస్తున్నారు..? అనే అంశంపై విడుద‌ల చేసి డేటా ప్ర‌కారం హైద‌రాబాదీలు(Hyderabad)ఎక్కువ‌గా స్విగ్గీలో వేటిని బుక్ చేస్తున్నారో కూడా వెల్లడించింది.

Crime news: 50రూపాయల కోసం ఫ్రెండ్స్ మధ్య ఫైటింగ్ .. వేటితో కొట్టుకున్నారో తెలుసా..?



రాత్రి 10తర్వాతే వాటికే డిమాండ్..

దేశంలో స్విగ్గీ యాప్‌లో కిరాణా, పండ్లు, కూరగాయలు మొద‌ల‌గు ఉత్పత్తుల అత్యధిక ఆర్డర్‌లను చేసే మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్, ముంబై, బెంగళూరులోని ఆర్డర్‌లు కెనడా మొత్తం జనాభా ఒక సంవత్సరం ఆర్డర్‌ల కంటే ఎక్కువ ఉండ‌టం విశేషం. జూన్ 2021 నుండి జూన్ 2022 వరకు స్విగ్గీ ఆర్డర్ సంఖ్యలో 16 రెట్లు అధికంగా ఉంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులలో మహిళల మెన్‌స్ట్రువల్ కప్పులు, శానిటరీ నాప్‌కిన్‌లలో అత్యధిక ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తమ డేటాలో తెలిపింది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ , చెన్నై, హైదరాబాద్‌లలో దాదాపు రెండు మిలియన్ల ఆర్డర్‌లతో (శానిటరీ న్యాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు, టాంపాన్‌లతో సహా) అత్య‌ధిక‌ ఆర్డర్‌లను అందుకున్న‌ట్లు కంపెనీ తెలిపింది.

హైదరాబాదీలు గట్టిగా వాడేస్తున్నారు..

ప్రథమ చికిత్స వస్తువుల ఆర్డర్‌లు దాదాపు 45,000 బ్యాండ్-ఎయిడ్‌ల బాక్సులను ఆర్డర్‌లలో గ‌ణ‌నీయంగా పెరుగుదలను క‌నిపించింది. వీటితోపాటు కండోమ్‌ల ఆన్‌లైన్ డెలివరీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 570 రెట్లు పెరిగింది. వీటితో పాటు తాజా జ్యూస్, నూడుల్స్ హైదరాబాదీలు ఏప్రిల్, జూన్‌లలో దాదాపు 27,000 జ్యూస్ బాటిళ్లను ఆర్డర్ చేశారని స్విగ్గీ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 5.6 మిలియన్ ఇన్ స్టెంట్ న్యూడిల్స్ ప్యాకెట్లు డెలివరీ చేసిన‌ట్లు సంస్థ తెలిపింది. అల్పాహారం కోసం గుడ్లు , స్విగ్గ్ీ ఇన్స్టామార్ట్ లో గత రెండేళ్లలో 50 మిలియన్లకు పైగా గుడ్లు, 30 మిలియన్లకు పైగా పాల ఆర్డర్‌లను డెలివరీ చేసింది. బెంగళూరు, హైదరాబాద్ కస్టమర్లు అల్పాహారం కోసం అత్య‌ధిక‌ సంఖ్యలో గుడ్లను ఆర్డర్ చేశార‌ని డేటాలో సంస్థ తెలిపింది.

Petrol Free : కుమారుడి జ్ఞాప‌కార్ధం తండ్రి ఫ్రీ పెట్రోల్ సప్లై .. క్యూ క‌ట్టిన జ‌నం ఎక్కడంటే   



డేటా బయటపెట్టిన స్విగ్గీ..

బెంగళూరు, ఢిల్లీ, ముంబై గత ఏడాదితో పోలిస్తే సగటున ఆరు మిలియన్ల గుడ్డు ఆర్డర్‌లు చేశాయి. ఇదిలా ఉంటే రాత్రి 10గంటల తర్వాత ఐస్‌క్రీమ్‌ల కోసం అత్య‌ధిక ఆర్డర్లు అందుకుంద‌ని సంస్థ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ ఈ ఆర్డ‌ర్ల శాతం 42 శాతం పెరిగడం విశేషంగా చెప్పుకొచ్చింది. స్విగ్గీ ఇన్టామార్ట్ ప్లాట్‌ఫారమ్ నుండి దాదాపు 62,000 టన్నుల పండ్లు కూరగాయలు కొనుగోలు చేయబడ్డాయి. అలాగే గతేడాదిలో ఆర్గ‌నిక్ పండ్లు, కూరగాయలలో 58 రెట్లు పెరుగుదల ఉంది. హైద‌రాబాదీలు మిరపకాయల అత్య‌ధిక ఆర్డర్లు వ‌చ్చిన‌ట్లు స్విగ్గీ తెలిపింది. క్రితం ఏడాదిలో ఇన్‌స్టామార్ట్‌లో 62,000 టన్నుల పండ్లు, కూరగాయలు ఆర్డర్ చేయబడ్డాయి. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్లు అత్య‌ధికంగా అమ్ముడైన మొదటి మూడు కూరగాయలు కాగా హైదరాబాద్, బెంగళూరులో గతేడాది 290 టన్నుల పచ్చి మిరపకాయలను ఆర్డర్ వినియోగదారులు ఆర్డర్ చేసినట్లుగా తమ డేటాను విడుదల చేసింది.

First published:

Tags: Hyderabad, Swiggy, Telangana News

ఉత్తమ కథలు