HYDERABAD DISTRIBUTION OF BATTINI BROTHERS FISH PRASADAM IN HYDERABAD WILL BE STOPPED THIS TIME SNR
TS|HYD: ఆస్తమా రోగులకు బ్యాడ్ న్యూస్..ఈసారి కూడా చేప ప్రసాదం నిలిపివేత
(ప్రతీకాత్మకచిత్రం)
TS|HYD:ఆస్తమా రోగులకు ఓ బ్యాడ్ న్యూస్. ఏటా బత్తిని బ్రదర్స్ ఉచితంగా ఇచ్చే చేప ప్రసాదం ఈసారి కూడా రద్దు చేశారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా గత రెండేళ్లు మాదిరిగానే ఈసారి చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని..ఆస్తమా రోగులు ఎవరూ హైదరాబాద్కు రావద్దని సూచించారు బత్తిని బ్రదర్స్.
చేప ప్రసాదం, బత్తిని బ్రదర్స్(Battini Brothers)చేప ప్రసాదం గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆస్తమా రోగుల(Asthma patients)కోసం చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణి చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మృతశిరకార్తె వచ్చిందంటే చాలు ..హైదరాబాద్ (Hyderabad ) నాంపల్లి(Nampally)ఎగ్జిబిషన్ గ్రౌండ్స్(Exhibition Grounds)లో భారీ ఎత్తున చేప మందుని ఫ్రీగా పంపిణి చేస్తున్నారు బత్తిని సోదరులు(Battini Brothers). అయితే గత రెండేళ్లుగా కరోనా(Corona) కారణంగా చేప మందు ప్రసాదాన్ని రోగులకు అందజేయలేకపోయారు. గత రెండేళ్లే కాదు...ఈసారి కూడా కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వం బత్తిని సోదరులు పంపిణి చేసే చేప మందు ప్రసాదానికి అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఆస్తమా రోగులు(Asthma patients)ఎవరైనా చేప ప్రసాదం కోసం హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉండటంతో బత్తిని సోదరులు ముందుగానే ప్రకటన చేశారు. గత రెండు సంవత్సరాల మాదిరిగానే ఈసారి చేప మందు ప్రసాదం పంపిణి చేయడం లేదని తెలియజేశారు.
చేప మందు ఈసారి లేదు..
బత్తిని సోదరుల వంశపారంపర్యంగా వస్తున్న ఈ చేపమందు పంపిణి సంప్రదాయాన్ని కొన్ని దశాబ్ధాలుగా కొనసాగిస్తూ వచ్చారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణి చేసేవారు. ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా ఆస్తమా రోగులు హైదరాబాద్కు వచ్చేవారు. ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని బత్తిని గౌరి శంకర్ తెలిపారు. కాబట్టి చేప ప్రసాదం కోసం ఎవరూ హైదరాబాద్కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఆస్తమా రోగులకు బ్యాడ్ న్యూస్..
పూర్వికుల నుంచి సంప్రదాయం వస్తున్న ఈ చేప ప్రసాదం పంపిణిపై పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయి.ఆస్తమా రోగులకు ఇది మందుగా పని చేస్తుందనే ఆలోచనతో మొదట్లో చేప మందు అనే వాళ్లు. కాని బత్తిని బ్రదర్స్ పంపిణి చేసే చేప ప్రసాదంలో మెడిసిన్ గుణాలు ఉన్నట్లుగా ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ జరగకపోవడంతో దీన్ని చేప ప్రసాదంగా పిలుస్తూ వస్తున్నారు. విమర్శల విషయం పక్కనపెడితే బత్తిని బ్రదర్స్ పంపిణి చేసే చేప ప్రసాదానికి చాలా మంది రెగ్యులర్ రోగులు కూడా ఉన్నారు. వాళ్లు మాత్రం దీన్ని చేప మందుగానే పరిగణిస్తామని గతంలోనే తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.