హోమ్ /వార్తలు /తెలంగాణ /

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డితో తలసాని, జీవన్‌రెడ్డి వాగ్వాదం..అసెంబ్లీలో రచ్చ రచ్చ

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డితో తలసాని, జీవన్‌రెడ్డి వాగ్వాదం..అసెంబ్లీలో రచ్చ రచ్చ

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

TRS vs CONGRESS: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్‌ వార్ నడిచింది. టీఆర్‌ఎస్‌ అబద్దాల పార్టీ అని కోమటిరెడ్డి కామెంట్ చేస్తే..నిజం చెప్పిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మడం లేదని కౌంటర్ ఇచ్చారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.

ఇంకా చదవండి ...

అధికార టీఆర్‌ఎస్‌(TRS), ప్రతిపక్ష కాంగ్రెస్‌(CONGRESS)సభ్యులకు మధ్య వాగ్వాదం, ఆసక్తికరమైన చర్చకు తెలంగాణ అసెంబ్లీ (Assembly)సమావేశాలు వేదిగా మారాయి. సభలో రాష్ట్రంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుండగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్( Talasani Srinivas Yavad)మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య డైలాగ్‌ వార్ పీక్స్‌కి చేరుకుంది. కోమటిరెడ్డిని తలసాని కాంట్రాక్టర్‌తో పోల్చారు. అందుకే ఎక్కువగా కాంట్రాక్టర్ల గురించే మాట్లాడుతారని రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopalreddy)కి చురకలు అంటించారు. వెంటనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అంతే ధీటుగా తలసానికి కౌంటర్ ఇచ్చారు. నేను కాంట్రాక్టర్నే అయితే ఎమ్మెల్యే కావద్దా.. పేకాట ఆడినోళ్లే మంత్రులు అవగా లేనిది కాంట్రక్టర్‌ ఎమ్మెల్యే తప్పేంటని డైలాగ్‌ని తిప్పి కొట్టారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ మంత్రులు వేములప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌తో పాటు విప్ బాల్కసుమన్ కోమటిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల నేతలు పరస్పరం తీవ్రస్థాయిలో వాగ్వాదం చేసుకోవడంతో స్పీకర్‌ వాటిని రికార్డుల నుంచి తొలగించారు. ఈ రచ్చ ముగియడంతో రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

అసెంబ్లీలో హాట్‌ హాట్‌ డిస్కషన్..

ఇదే అసెంబ్లీ సెషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య కూడా చర్చ జరిగింది. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం మాది. మా 12 మంది ఎంపీలు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కోమటిరెడ్డి అంటే తెలంగాణ ఇచ్చిన మీరు 2014లో ఎందుకు అధికారంలోకి రాలేదని జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాదిరిగా కాంగ్రెస్‌ అబద్దాలు చెప్పలేదని అందుకే అధికారంలోకి రాలేకపోయామన్నారు రాజగోపాల్‌రెడ్డి. మేం అబద్దాలు చెప్పామని ఆరోపిస్తున్న మీరు ఇన్నేళ్లు చెప్పినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదని తిరిగి బంతిని కాంగ్రెస్‌ కోర్టులనే వేశారు. మేం కొన్ని తప్పులు చేశాం కాబట్టే మీ అబద్దాలను ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారని డిస్కర్షన్‌ని ముగించారు.

(అసెంబ్లీలో డైలాగ్ వార్‌)

రెండు పార్టీల మధ్య డైలాగ్‌ వార్..

సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సభ బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే సభలోపల వాళ్ల ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హితవు పలికారు కేటీఆర్‌. కాంగ్రెస్సే అవినీతి పార్టీ అన్న కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతికి సంబంధించిన ఆధారాలుంటే ఫిర్యాదు చేయమన్నారు కేటీఆర్.


ఫైనల్‌గా తేలింది అది..

సభ లోపల కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య డైలాగ్‌ వార్ ఓ రేంజ్‌లో జరిగింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సోమవారం సెషన్స్‌ జరుగుతుండగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య కూడా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లు , కారు ఇస్తే తాను ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. వీరి సంభాషణ మీడియా పాయింట్‌ దగ్గర ఇలా జరుగుతుండగానే ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కల్పించుకుని జగ్గన్న మా వాడే అక్కడున్నా.. ఎక్కడున్నా జగ్గన్న మాలో వాడే అని కలుపుకొనిపోయారు. జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పని చేసిన జర్నలిస్ట్‌లకు ఇళ్లు, కార్లు ఇస్తే ఒకసారి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జర్నలిస్ట్‌లకు ఇళ్లు కట్టిస్తే టీఆర్‌ఎస్‌లో చేరుతానని తాను చెప్పలేదని ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను అని మాత్రమే చెప్పారు. అంతే కాగు కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Congress mla, Telangana Assembly, TRS leaders

ఉత్తమ కథలు