Home /News /telangana /

HYDERABAD DETAILS OF CREDIT CARDS THAT OFFER HIGHER BENEFITS WITH LOWER ANNUAL CHARGES GH SNR

Credit Cards: తక్కువ యాన్యువల్ ఫీజులతో చక్కటి బెనిఫిట్స్ అందిస్తున్న క్రెడిట్ కార్డ్స్ ఇవే..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Credit Cards: కొన్ని క్రెడిట్ కార్డ్స్ నామమాత్రపు యాన్యువల్ ఫీజులతో కూడా చాలా ప్రాక్టికల్ బెనిఫిట్స్ (Practical Benefits) ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ఎక్కువ బెనిఫిట్స్ అందించే హై-ఎండ్ క్రెడిట్ కార్డ్‌లు (Credit Cards) అధిక ఫీజుల వస్తుంటాయి. మామూలుగా క్రెడిట్ కార్డుల యాన్యువల్ ఫీజు (Annual Fee) రూ.5,000గా ఉంటుంది. అయితే ఎక్కువ బెనిఫిట్స్ ఆఫర్ చేసే కొన్ని కార్డులు రూ.10,000 వరకు కూడా యాన్యువల్ ఫీజులు వసూలు చేస్తాయి. ఐతే ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే అధిక యాన్యువల్ ఫీజులు చెల్లించి హై-ఎండ్ కార్డులు తీసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే కొన్ని కార్డ్స్ నామమాత్రపు యాన్యువల్ ఫీజులతో కూడా చాలా ప్రాక్టికల్ బెనిఫిట్స్ (Practical Benefits) ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏమిటో డిటెయిల్డ్‌గా తెలుసుకుందా. ఆల్రెడీ క్రెడిట్ కార్డులు ఉంటే..వాటిపై ఉన్న ఆఫర్‌లను ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకుందా. ముఖ్యంగా అతి తక్కువ ఆన్యూవల్ ఫీజ్ 250 రూపాయల యాక్సిస్‌ బ్యాంక్ నియో కార్డుతో మొదలుపెట్టి.. 588రూపాయల ఆన్యువల్ ఛార్జీలు వసూలు చేసే స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డ్ వరకు ఆఫర్‌లు ఈవిధంగా ఉన్నాయి.

* యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్
యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ రూ.250 విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్, 3 నెలల జొమాటో ప్రో సబ్‌స్క్రిప్షన్, రూ.250 విలువైన బ్లింకిట్ (Blinkit) వోచర్, వెల్కమ్ బెనిఫిట్ గా ఆరు నెలల 1mg సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇది మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, పేటీఎం ద్వారా చేసి (DTH) రీఛార్జ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ (నెలకు రూ.150 వరకు) అందిస్తుంది. ఇండియాలోని పార్ట్‌నర్డ్ రెస్టారెంట్‌లలో ఖర్చు చేసేటప్పుడు 15 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఆఫర్ చేసే ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు కేవలం రూ.250 మాత్రమే!

తక్కువ ఆన్యువల్ ఛార్జీలతో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్న క్రెడిట్ కార్డుల డిటెయిల్స్| Details of credit cards that offer higher benefits with lower annual charges
(ప్రతీకాత్మకచిత్రం)


* ఎస్‌బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్
ఎస్‌బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్ (SBI SimplyCLICK)లో జాయిన్ అవ్వగానే రూ.500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పొందొచ్చు. ఇది అమెజాన్, క్లియర్ ట్రిప్, బుక్ మైషో, లెన్స్ కార్ట్, పార్ట్నర్డ్ కంపెనీ నుంచి 10X రివార్డ్‌లు ఆఫర్ చేస్తోంది. అలానే ఆన్‌లైన్ ఖర్చులన్నింటిపై 5X రివార్డ్‌లు, 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపును అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ కి యాన్యువల్ ఫీజు రూ.499 చెల్లించాలి.

* యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డు
గూగుల్ పే ద్వారా చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్ పై యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇది స్విగ్గీ, జొమాటో, ఓలాపై 4 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర ఖర్చులపై 2 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఖర్చులపై క్యాష్‌బ్యాక్‌తో పాటు, ఇండియాలోని 4000కి పైగా పార్టనర్డ్ రెస్టారెంట్‌లలో ఏడాదికి 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, 20 శాతం వరకు ఈ కార్డు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ యాన్యువల్ ఫీజు రూ. 499.

* HDFC మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్
హెచ్‌డీఎఫ్‌సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్ 500 క్యాష్ పాయింట్లను వెల్ కమ్ బెనిఫిట్ గా ఆఫర్ చేస్తోంది. ఆఫ్‌లైన్‌లో స్టోర్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి 2 రివార్డ్ పాయింట్‌లు, ఆన్‌లైన్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి 4 రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. ఈ కార్డును యూజ్ చేసి మొదటి ఏడాదిలో రూ.50,000 ఖర్చు చేస్తే, రెన్యువల్ ఫీజు మాఫీ అవుతుంది. అలాగే 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.500.

* ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఈ క్రెడిట్ కార్డు ద్వారా 30 రోజులలోపు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే... రూ.500 విలువైన ఫ్లిప్‌కార్ట్ వోచర్‌లను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మింత్ర షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర వాటిలో 4 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఖర్చులపై క్యాష్‌బ్యాక్‌తో పాటు, ఒక కార్డ్ హోల్డర్‌ సంవత్సరంలో నాలుగు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అందుకోవచ్చు. ఇండియాలోని పార్ట్నర్డ్ రెస్టారెంట్‌లలో డైనింగ్‌పై 20 శాతం వరకు తగ్గింపు, 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.500.

* స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డ్
స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డ్ బ్లింకిట్ (Blinkit) Zomatoలో 10 శాతం తగ్గింపును అందిస్తుంది. మింత్రాలో నెలకు ఒకసారి షాపింగ్ చేస్తే 20 శాతం తగ్గింపు లభిస్తుంది. దేశీయ విమాన టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు రూ.750 వరకు 20 శాతం తగ్గింపు పొందొచ్చు. మూడు నెలలకు ఒకసారి రూ.10,000లోపు బుక్ చేసుకునే అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లపై 10 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ప్రతి మూడు నెలలకు యాత్రలో చేసే హోటల్ బుకింగ్‌లపై 25 శాతం తగ్గింపు ఆఫర్ ఉంటుంది. అలా ఒక లావాదేవీపై రూ.4,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.588.
Published by:Siva Nanduri
First published:

Tags: Bussiness Tips, Credit cards, Offers

తదుపరి వార్తలు