హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad | Accident : హైదరాబాద్ రోడ్లపై సంచరిస్తున్న యమభటులు .. కిల్లర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన లేడీ డాక్టర్‌

Hyderabad | Accident : హైదరాబాద్ రోడ్లపై సంచరిస్తున్న యమభటులు .. కిల్లర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన లేడీ డాక్టర్‌

hit and run case

hit and run case

Accident: యమభటులు హైదరాబాద్ రోడ్లపైకి సంచరిస్తున్నారు. కార్లు, బైక్‌లను నడుపుతూ వేగమనే యమపాశాన్ని విసిరి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. మూడ్రోజుల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్‌లో బాధితురాలి చావుతో పోరాడి శనివారం ప్రాణం వదిలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌ (Hyderabad)రోడ్లపై స్పీడ్ కంట్రోల్ గన్ కెమెరాలు(Speed ​​control gun cameras) ఏర్పాటు చేసినా..అడుగడుగునా ట్రాఫిక్‌ చెకింగ్(Traffic checking)పెట్టినప్పటికి రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. వాహనచోదకుల రూపంలో యముకింకరులు రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలో మూడ్రోజుల క్రితం ఓ లేడీ డాక్టర్‌(Lady Doctor) ప్రయాణిస్తున్న బైక్‌(Bike)ను కారు ఢీకొట్టడంతో చావుతో పోరాడిన డాక్టర్ శనివారం(Saturday)ప్రాణాలు వదిలింది. ప్రాణాలు పోయాల్సిన వైద్య వృత్తిలో ఉన్న యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం అందర్ని కలచి వేసింది.

CM KCR | BATUKAMMA: తెలంగాణతో పాటు 8దేశాల్లో బతుకమ్మ సంబురాలు .. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

రోడ్లపైకి వస్తున్న యమభటులు..

భాగ్యనగరంలో వాహనచోదకులు అమాయకుల పాలిట యమభటుల్లా మారుతున్నారు. ఈనెల 21వ తేదిన హైదరాబాద్ శివారు ప్రాంతమైన హస్తినాపురంలో ఓలా బైక్‌పై వెళ్తున్న డెంటల్ డాక్టర్ శ్రావణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దంతాల డాక్టర్‌గా పని చేస్తున్న శ్రావణి సెప్టెంబర్‌ 21న ఓలా బైక్‌ని బుక్ చేసుకుంది. గమ్య స్థానానికి వెళ్లేందుకు ప్రయాణమైన సమయంలో బైక్‌ నార్మల్ స్పీడ్‌లో ఉండగానే వెనుక నుంచి వచ్చిన కారు శ్రావణి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో ఓలా బైక్ డ్రైవర్‌ వెంకటయ్యతో పాటు శ్రావణికి బలమైన దెబ్బలు తగిలాయి.

25రోజుల్లోనే తల్లీ,కూతురు మృతి..

వెంటనే శ్రావణితో పాటు డ్రైవర్‌ని ఆసుపత్రికి తరలించారు. మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న శ్రావణి శనివారం తుది శ్వాస విడిచింది. తలకు బలమైన దెబ్బ తగలడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు తెలిపారు. ఇంకా విషాదకరమైన సంఘటన ఏమిటంటే ..సరిగ్గా నెల రోజుల క్రితమే శ్రావణి తల్లి గుండె పోటుతో మృతి చెందారు. నెల రోజులు తిరగకుండా ఒకే ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో విషాదం నెలకొంది.

Hyderabad : 17లక్షలు చెల్లిస్తేనే చికిత్స లేదంటే డిశ్చార్జ్..కార్పొరేట్ ఆసుపత్రిపై రోగి బంధువులు ఆగ్రహం

లైసెన్స్ లేదు..పేపర్స్ లేవు..

శ్రావణి ప్రయాణిస్తున్న ఓలా బైక్‌ని ఢీకొట్టిన కారును పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన స్తలంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడు ఇబ్రహీంగా గుర్తించారు. అంతే కాదు కారు డ్రైవర్‌ ఇబ్రహీం మలక్‌పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే కారుకు సంబంధించిన లైసెన్స్, పేపర్లు ఏవీ లేవని పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆదారంగా పట్టుకున్న నిందితుడు కారు డ్రైవర్‌ ఇబ్రహీంపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Car accident, Hyderabad news, Telangana crime news

ఉత్తమ కథలు