Home /News /telangana /

HYDERABAD DEMAND FOR HYDERABAD METRORAIL HAS INCREASED BY MORE THAN FOUR LAKH PEOPLE PER DAY SNR

Telangana : హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సర్వీసులకు పూర్వ వైభవం..ఒక్క రోజులో ఎన్ని లక్షల మంది ప్రయాణించారంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో రైల్ మళ్లీ లాభాల బాటలో పరుగులు పెడుతోంది. ప్రయాణికులతో మళ్లీ కిటకిటిలాడుతూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. రెండేళ్ల క్రితం ఉన్న జోష్‌ని తిరిగి కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం మెట్రో రైల్‌లో రోజుకు ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
హైదరాబాద్‌(Hyderabad)నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మెట్రోరైల్‌(Metrorail) మరోసారి అదే స్పీడుతో దూసుకెళ్తోంది. సుమారు రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది ప్రయాణం చేస్తారనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ట్రైన్ సర్వీస్(Train service) మొదట్లో ప్రయాణికుల రద్దీగా కళకళలాడుతూ ఉండేది. కరోనా(Corona) కారణంగా మధ్యలో ఆంక్షలు విధించడంతో ఆదరణ తగ్గింది. అయితే హైదరాబాద్ మెట్రోరైల్ సర్వీసు(Hyderabad Metrorail Service) పడి లేచిన కెరటంలా మళ్లీ పుర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. కోవిడ్ నిబంధనల్ని పూర్తిగా తొలగించడం, వర్షాకాలం కావడం మెట్రో రైల్‌లో ప్రయాణించే వారి సంఖ్య మళ్లీ పెరిగింది. దీంతో కరోనాకు ముందు ఎంత మంది ప్రయాణించే వారో అంతే సంఖ్యలో ఇప్పుడు అంతే రద్దీగా మెట్రోట్రైన్స్ ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి.

Telangana : హాస్టల్‌లో బాలిక మృతి ..శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడంపై పేరెంట్స్ ఆగ్రహం



ప్రయాణికులతో కిటకిట..
హైదరాబాద్‌లో మెట్రోరైల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన కొత్తలో సుమారు రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్రయాణించే వారు. కాని కరోనా సంక్షోభం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వంటి కారణాలు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లాభాలను బాగా దెబ్బతీశాయి. ఫలితంగా ట్రైన్‌ ఎక్కే వారి కంటే సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారే ఎక్కువగా ఉండేవారు. కాని ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోరైల్‌కు మళ్లీ పాత రోజులు వచ్చాయి. మెట్రోరైల్‌ అధికారుల లెక్కల ప్రకారం సోమవారం ఒక్కరోజే 3.94లక్షల మంది ట్రైన్ సర్వీస్‌ని ఉపయోగించుకున్నట్లుగా సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అంటే ఈ స్థాయిలో ఆదరణ సుమారు రెండేళ్ల క్రితం ఉండేది. తిరిగి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందని సంస్థ యాజమాన్యం తెలిపింది.



మళ్లీ పూర్వ వైభవం..
ప్రస్తుతం చూసుకుంటే కార్పొరేట్, ఐటీ కంపెనీలు సుమారు 35శాతం వర్క్‌ ఫ్రమ్ హోమ్ తొలగించడంతో మెట్రోరైల్‌ సర్వీసులకు ఈస్థాయిలో డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. దీనికి తోడు కొత్తగా లక్షన్నర మందికిపైగా కొత్తగా ఉద్యోగాల్లో చేరడంతో నాగోల్- రాయదుర్గం మధ్యలో మెట్రోరైల్‌ సర్వీసులు ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగింది. మియాపూర్‌ టు ఎల్బీనగర్‌ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్ కావడంతో ఈ మార్గంలో కూడా మెట్రో రైల్‌లో ప్రయాణించే వారి సంఖ్య ఈమధ్య కాలంలో రెట్టింపు అయింది అంటోంది సంస్థ యాజమాన్యం. ప్రస్తుతం మెట్రోరైల్‌లో ప్రయాణించే వారి సంఖ్య సరాసరి రోజుకు 4లక్షల మందికి చేరువలో ఉంటోందని పేర్కొంది. వీకెండ్స్‌లో హాలిడే కార్డ్స్‌తో ట్రైన్‌లో తిరిగే ప్రయాణికుల సంఖ్య కూడా బాగానే ఉంటోందని హైదరాబాద్‌ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి స్పష్టం చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad Metro rail, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు