హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : తనను విడిచి వెళ్లిందనే బాధతో ..పెంపుడు కుక్క కోసం డిగ్రీ స్టూడెంట్ ఏం చేశాడో తెలుసా

Hyderabad : తనను విడిచి వెళ్లిందనే బాధతో ..పెంపుడు కుక్క కోసం డిగ్రీ స్టూడెంట్ ఏం చేశాడో తెలుసా

DOG LOVER SUICIDE

DOG LOVER SUICIDE

HYDERABAD: పెంపుడు జంతువులను కన్నబిడ్డల్లా చూసుకునే వాళ్ల గురించి విన్నాం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న జంతువులకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతున్న వాళ్లను చూశాం. కాని హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఒక విషాధ సంఘ‌ట‌న అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. పెంపుడు జంతువుపై ప్రేమానురాగాలు పెంచుకుంటే అంతటి త్యాగానికి కూడా సిద్ధపడాతారా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (M.Balakrishna,News18,Hyderabad)
  ఈ మ‌ధ్య కాలంలో మ‌నుషుల‌తో ఉండే అనుబంధాల కంటే పెంపుడు జంతువుల‌తో పెనవేసుకుంటున్న సంబంధాలే ఎంతో బలంగా ఉంటున్నాయి. మాన‌వ సంబంధాల‌న్ని డ‌బ్బుతో ముడి పడి ఉండటంతో ఎక్కువ మందికి జీవితంలో ఒంట‌రిత‌నం భరించలేకపోతున్నారు. అందుకే మ‌నుషుల‌పై ప్రేమ కంటే జంతువుల‌పై ప్రేమ పెంచుకుంటున్నారు. వాటినే క‌న్న బిడ్డల్లా చూసుకుంటూ మురిసిపోతున్నారు. పెంపుడు జంతువు(Pet)ల పుట్టి రోజును ఓ వేడుకలా నిర్వహిస్తున్న సంఘటనలు నిత్యం ఏదో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న జంతువులకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతున్న వాళ్లను చూశాం. అందుకే పెంపుడు జంతువులతో అంత‌లా బంధం పెంచుకుంటున్నారు. హైద‌రాబాద్(Hyderabad) లో జ‌రిగిన ఒక విషాధ సంఘ‌ట‌న అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. పెంపుడు జంతువుల‌పై ప్రేమానురాగాలు పెంచుకుంటే అంతటి త్యాగానికి కూడా సిద్ధపడాతారా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

  Drugs gang arrest: పబ్‌లు, క్లబ్బుల్లో కాదు కొరియర్‌లో డ్రగ్స్ సప్లై .. హైదరాబాద్‌లో ఎంత మంది వాడుతూ పట్టుబడ్డారో తెలుసా..?


  మూగజీవిపై అమితమైన ప్రేమ..
  మనుషుల్లో మానవత్వం కరువైపోతున్న ఈరోజుల్లో నోరు లేని జంతువులతోనే సహవాసం మంచిదని చాలా మంది భావిస్తున్నారు. అందుకే బిడ్డలైనా, బంధువులైనా, స్నేహితులైనా వాటితో సరిరావని భావిస్తూ విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన కుక్కులను పెంచుకుంటున్నారు. వాటి కోసం తీసుకునే శ్రద్ధ, వాటిపై చూపించే ప్రేమ మాటల్లో చెప్పలేనంతగా మారిపోయింది. హైదరాబాద్‌ అల్వాల్‌లోని రీట్రీట్‌ కాలనీకి చెందిన విష్ణునారాయణ అనే 20సంవత్సరాల విద్యార్ధి మూడేళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విష్ణునారాయణ తన పెంపుడు కుక్కతో అనుబంధాన్ని పెంచుకుంటూ వచ్చాడు. కాలేజీ నుంచి రాగానే దానితోనే కాలక్షేపం చేయడం, దాంతోనే గడపటం చేస్తూ ఉండేవాడు.


  చనిపోవడం తట్టుకోలేక..
  విష్ణునారాయణ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క మూడు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. పెంపుడు జంతువు లేదనే వార్తను విష్ణునారాయణ త‌ట్టుకోలేకపోయాడు. గత నెల 31వ తేదిన కాలేజీ నుంచి ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం అయినప్పటికి గదిలోంచి విష్ణు నారాయణ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టి చూడటంతో లోపల విగతజీవిగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. అంతే కాదు తన చావుకు కారణం ఏమిటో తెలియజేస్తూ ఓ సూసైడ్‌ లెటర్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూగ‌జీవిపై పెంచుకున్న అనుబంధం తమకు కడుపు కోతను మిగిల్చిందని విష్ణునారాయణ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పెంపుడు కుక్క చనిపోయిన రోజున కాలేజీలో కూడా చాలా డల్‌గా ఉన్నాడని తోటి విద్యార్ధులు, మృతుని స్నేహితులు తెలిపారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Hyderabad news, Student suicide, Telangana News

  ఉత్తమ కథలు