Home /News /telangana /

HYDERABAD DASOJU SHRAVAN KUMAR RESIGNED FROM TELANGANA CONGRESS PARTY SNR

Telangana : రాజగోపాల్‌రెడ్డి బాటలోనే దాసోజు శ్రవణ్ .. తెలంగాణ కాంగ్రెస్‌కి వరుస కష్టాలు

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు ముసలం వదలక ముందే కొత్త కష్టం వచ్చి పడింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అధికార పార్టీపై తన వాగ్ధాటిని గట్టిగా వినిపించే నేత హస్తంతో దోస్తీ కటీఫ్ చేసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు(Munugodu) ముసలం వదలక ముందే కొత్త కష్టం వచ్చి పడింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి(National Representative), అధికార పార్టీపై తన వాగ్ధాటిని గట్టిగా వినిపించే నేత హస్తంతో దోస్తీ కటీఫ్ చేసుకున్నారు. పార్టీలో నెలకొన్న పరిణామాలు, కొత్తగా చేరిన నేతల వల్లే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌(Congress)గూటిని వదిలిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)కి లేఖ రాశారు.

Telangana Politics: బీజేపీ బలిసినోళ్ల పార్టీ .. కాంగ్రెస్ పేదల కన్నీళ్లు తుడిచే పార్టీ : ఎమ్మెల్యే సీతక్క



మరో వికెట్ ఔట్ ..
తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో..ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో పట్టున్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటంతో ..అక్కడ బలమైన నేత కోసం వెదుక్కునేలోపే కాంగ్రెస్ పార్టీకి మరో రూపంలో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీని వీడక ముందు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాశోజు శ్రవణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.


 కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం..
టీపీసీసీ చీఫ్‌ మారిన తర్వాత నుంచి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో కాస్త అంటి ముట్టనట్లుగా ఉన్న శ్రవణ్‌కుమార్..ఆ తర్వాత గాంధీభవన్‌కి రావడం కూడా తగ్గించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్‌లోకి చేరడంతో ఆయన మరింత అసంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గ సీటు దక్కదనే ఆలోచనతోనే తన పొలిటికల్ రూట్ క్లియర్ చేసుకోవడానికే కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీని వీడుతున్న శ్రవణ్‌కుమార్ ..నెక్స్ట్ ఏ పార్టీలో చేరతారు..? ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే చర్చ ఇప్పటి నుంచే విస్తృతంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ ఫోటోను మార్చిన శ్రవణ్‌కుమార్..అతి త్వరలోనే ఏ పార్టీలో చేరబోతున్నది ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Congress ts, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు