• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD CYCLISTS DELIVERING MEDICINES EMERGENCY RESOURCES TO DOORSTEP HELP TO ELDERLY FIGHT COVID 19 GH SA

Relief Riders: సైక్లింగ్‌ను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న హైదరాబాదీ.. రిలీఫ్ రైడర్స్ పేరుతో సేవా కార్యక్రమాలు

Relief Riders: సైక్లింగ్‌ను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న హైదరాబాదీ.. రిలీఫ్ రైడర్స్ పేరుతో సేవా కార్యక్రమాలు

_Raksha Gowda guppedantha manasu (2)

కరోనా మహమ్మారి కారణంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు ఇళ్లకే పరిమితమై మానసిక సమస్యల

  • Share this:







కరోనా మహమ్మారి కారణంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు ఇళ్లకే పరిమితమై మానసిక సమస్యల బారిన పడుతుంటే.. మలి వయసు వారు తమ కనీస అవసరాలు తీర్చుకోలేక వేదనకు గురవుతున్నారు. ఇలాంటి వారి ఇబ్బందులను గుర్తించి ప్రత్యేకంగా సేవలందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన సైక్లింగ్ క్లబ్ నిర్వాహకులు. బయటకు రాలేని వారికి మందులు, ఇతర వస్తువులను వారి చెంతకు ఉచితంగా చేరవేస్తున్నారు. ‘బైస్కిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్‌’గా గుర్తింపు సాధించిన సంతాన సెల్వన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అతడితో పాటు వంద మంది వరకు వాలంటీర్లు ‘రిలీఫ్ రైడర్స్’ పేరుతో ఒక సంస్థగా ఏర్పడి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


హైదరాబాద్ నగరానికి చెందిన సంతాన సెల్వన్ అనే వ్యక్తికి ‘సైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్‌’ అనే బిరుదు ఉంది. ఈ ఏప్రిల్‌లో అంతర్జాతీయ సైక్లింగ్ సంస్థ ‘బీవైసీఎస్’ ఆయనకు ఈ గుర్తింపు ఇచ్చింది. రద్దీగా ఉండే నగరాలు, పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించడమే ఈ సంస్థ లక్ష్యం. కొన్ని వారాల క్రితం దేశంతో పాటు హైదరాబాద్‌లో కూడా కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎలాంటి ఆసరా లేని వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చాలని నిర్ణయించుకున్నారు సెల్వన్. తన సోషల్ మీడియా అకౌంట్‌లో అతడు ఇటీవల ఒక మెస్సేజ్‌ను షేర్ చేశారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్న వృద్ధులకు అవసరమైన వస్తువులు, మందులు, ఇతర సామగ్రిని ఉచితంగా చేరవేస్తానని చెప్పాడు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది అభాగ్యులు సెల్వన్ సాయం కోరారు.

ఆ తరువాత నిస్సహాయ స్థితిలో ఉన్న వయో వృద్ధులకు సేవలందించేందుకు ముందుకు రావాలని సెల్వన్ సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. అలాంటి వారికి సైకిల్‌పై వెళ్తూ మందులు అందజేయాలని కోరారు. ఈ పోస్టుకు ఎంతోమంది సైక్లింగ్ వాలంటీర్లు స్పందించారు. సెల్వన్‌ ప్రయత్నానికి వారు మద్దతు పలికారు. ఇప్పుడు దాదాపు 100 మంది వాలంటీర్లు కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరందరూ కలిసి ‘రిలీఫ్ రైడర్స్’ పేరుతో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాలంటీర్లు మొదట్లో వృద్ధులకు కేవలం మందులు పంపిణీ చేసేవారు. వీరి ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే.. మెడికల్ షాప్‌కు వెళ్లి దుకాణంలో మందులు తీసుకుంటారు. ఈ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించే ఏర్పాట్లు చేస్తారు. ఆ తరువాత మందులను ఉచితంగా అందజేస్తారు.


ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తలో వాలంటీర్లు కేవలం మందులను మాత్రమే చేరవేసేవారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, కోవిడ్ -19 రోగులకు అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. సెల్వన్, అతడి బృదం ఈ సేవలను విస్తరించే పనిలో ఉన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన వారికి ఆహారం, ఇతర నిత్యావసరాలను కూడా పంపిణీ చేయాలని వారు భావిస్తున్నారు.













First published: