(M.Balakrishna,News18,Hyderabad)
రోజురోజుకి సైబర్ నేరగాళ్ల(Cybercriminals)ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. సైబర్ నేరాల(Cyber Crimes)పై ప్రజల్లో అవగాహాన రావడంతో కొత్త దార్లు వెదుకుతున్నారు. అమాయకులు, చదువుకోని వారిని ఆసరాగా చేసుకొని కంటికి కనిపించకుండా మోసం చేస్తూ వస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు విద్యావంతులకు టోకరా వేస్తున్నారు. విద్యుత్ శాఖ(Electricity Department)తమ వినియోగదారులకు పంపించే మెసేస్ పైన కన్నేశారు. కరెంట్ బిల్లు(Current Bill)కట్టని వారికి ఫేక్ మెసేజ్(Fake message)లు పంపే క్రమంలోనే ఏకంగా విద్యుత్ శాఖ ట్రాన్ కో చైర్మన్‌కి మెసేజ్ పంపారు. దీనిపైనే పోలీసులు(Police) ఆరా తీస్తున్నారు.
కంత్రీగాళ్ల మోసాలు..
నిత్యం ఏదో ఒక చోట, ఏదో రూపంలో అమాయకుల్ని బురిడి కొట్టింటి వారి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరాల పట్ల, సైబర్ క్రిమినల్స్ పై తెలంగాణ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. క్యూ ఆర్ కోడ్లు, మొబైల్ ఫోన్‌కి కొన్ని అనుమాస్పద లింక్‌లు పంపుతూ వాటి ద్వారా జనాన్ని మోసం చేస్తూ వస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి వాటిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కలగడంతో కొత్త రూట్ వెదుకున్నారు. ఎవరకికి అనుమానం రాని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ తమ వినియోగదార్లకు పంపించే మెసేజ్ పై కన్నేశారు. వాస్తవానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రతి నెల తమ వినియోగదారులకు ఆ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లును మెసెజ్ రూపంలో పంపిస్తారు. దీంతోపాటు పాత బకాయిలు ఎమైన ఉంటే వాటి క్లియర్ చేసుకోవాలని కూడా మెసెజ్ రూపంలో వినియోగదారులకు పంపిస్తారు.
కొత్త తరహా సైబర్ నేరాలు ..
ఈతరహా మెసేజ్‌లను టార్గెట్‌గా చేసుకున్నారు సైబర్ మోసగాళ్లు. ఫేక్ మెసెజ్‌లను వినియోగదారులకు పంపిస్తూ బురిడి కొట్టిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సామాన్య విద్యుత్ వినియోగదారులకు పంపినట్లుగానే రోజుల క్రితం పెండింగ్ కరెంట్ క్లియర్ చేయమని లేకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ ఏకంగా విద్యుత్ శాఖ ట్రాన్స్‌కో చైర్మన్‌కే మెసేజ్ పంపారు. ట్రాన్స్‌కో, జెన్కో చైర్మన్ & ఎండీ డి ప్రభాకర్‌రావుకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే కనెక్షన్‌ను కట్ చేస్తామని హెచ్చరిస్తూ మెసేజ్ వచ్చింది. అప్పటికే అతను ఆ నెలకు సంబంధించిన బిల్లును చెల్లించారు. దీంతో తనకు వచ్చింది ఫేక్ మెసేజ్ అని నిర్ధారించుకొని రికార్డులను పరిశీలించారు. బకాయిలు లేవని తేలవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ప్రభాకర్.
విద్యుత్‌శాఖ చైర్మెన్కే షాక్ ఇచ్చారు..
విద్యుత్ శాఖ ట్రాన్స్‌కో అండ్ జెన్కో చైర్మన్ కంప్లైంట్ ఆధారంగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సాధారణంగా, TSSPDCL సిబ్బంది ఇంటికే వచ్చి విద్యుత్ బిల్లును అందజేస్తారు. బిల్లు ఇచ్చిన తర్వాత, వినియోగదారులకు బిల్లు గురించి మెసెజ్ వస్తుంది. తరువాత, పెండింగ్ బిల్లు గురించి వారికి గుర్తు చేయడానికి ఫాలో-అప్ మెసెజ్‌లు కూడా పంపిస్తోంది విద్యుత్ శాఖ. ఈ విధానాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అచ్చం విద్యుత్ శాఖ పంపించిన విధంగానే వారు కూడా రిమైండర్ మెసెజ్‌లు పంపించి మోసాలకు పాల్పడుతున్నారు.
ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్త..
సాదారణంగా సైబర్ నేరగాళ్లు పంపించే మెసెజ్ లు ఇలా ఉంటాయి. "డియర్ కస్టమర్, మీరు క్రిందటి నెల బిల్లు క్లియర్ చేయకపోవడం వలన ఈ రాత్రి 9.30 గంటలకు మీ పవర్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి వెంటనే మా విద్యుత్ అధికారి ఇచ్చిన ఫోన్ నంబర్లో సంప్రదించండి. ధన్యవాదాలు. అని ఉంటుంది. కంగారు పడి వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేస్తే ఇక మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవడం ఖాయం అంటున్నారు సైబర్ అధికారులు. ఈ తరహా స్కామ్‌లు గత కొద్ది కాలంగా సిటీలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి.కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber crimes, Telangana crime news