హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Traffic Police: ఈ ఫొటోకి సైబరాబాద్ పోలీసుల ట్రోలింగ్.. వైరల్ అవుతున్న ట్వీట్.. ఏంటంటే..

Telangana Traffic Police: ఈ ఫొటోకి సైబరాబాద్ పోలీసుల ట్రోలింగ్.. వైరల్ అవుతున్న ట్వీట్.. ఏంటంటే..

సైబరాబాద్ పోలీసులు ట్రోల్ చేసిన ఫొటో ఇదే

సైబరాబాద్ పోలీసులు ట్రోల్ చేసిన ఫొటో ఇదే

Traffic Police: వాహనదారులకు, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలోనూ.. అలాగే ఎటు వంటి తప్పులు ఇక ముందు చేయవద్దని చెప్పడంలో ఇటీవల తెలంగాణ పోలీసులు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. దానిలో భాగంగానే కొత్తగా మరో ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దానిలో ఏముందంటే..

ఇంకా చదవండి ...

వాహనదారులకు, ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలోనూ.. అలాగే ఎటు వంటి తప్పులు ఇక ముందు చేయవద్దని చెప్పడంలో ఇటీవల తెలంగాణ పోలీసులు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా (Social Media) ను ఆధారంగా చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అయితే, అప్పుడప్పుడు ట్రోలింగ్ కూడా చేస్తుంటారు. ఆ ట్రోలింగ్స్ కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి. వారు ట్రోలింగ్ చేసేది కూడా తప్పును చూపించేందుకే కానీ.. వ్యక్తిగతంగా ఎవరినీ ట్రోలింగ్ చేయడం లేదు. తాజా విషయానికి వస్తే ఓ యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతున్నాడు. ఆ వాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలనే రూల్ ఉంది. కానీ ఆమె(ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి) హెల్మెట్ కాకుండా ఆమె తలను కవర్ ని హెల్మెట్ లా వాడింది.

New Traffic Rule: బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక.. మీరు వాహనం నడిపేటప్పుడు ఇవి ధరించకపోతే భారీ జరిమానా.. ఏంటో తెలుసుకోండి..


ఈ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రతీ ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన ఎప్పటి నుంచే ఉంది. దానిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అయితే ఇటీవల పిలియన్ రైడర్ కూడా అంటే.. వాహనం నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకొచ్చారు. దీనిని సైబరాబాద్ పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎవరైనా హెల్మెట్ ధరించ లేదంటే ఫొటోలు తీసి చలానా మంజూరు చేస్తున్నారు. ఇలా ఓ వాహపదారుడు.. ఆ ద్విచక్ర వాహనంపై వెనుకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకుండా కవర్ ను నెత్తికి కవర్ చేసింది. దీనిపై పోలీసులు ఆ ఫోటోను ట్యాగ్ చేశారు. అంతే కాకుండా దానికి ఇలా కొటేషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే.. ‘‘హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్ ని హెల్మెట్ లా వాడమనలేదు.’’ అంటూ ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

తర్వాత దాని కిందే.. హెల్మెట్ పెట్టుకోండి. సురక్షితంగా ఉండండి అంటూ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా మంది దీనిపై కామెంట్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. కొందరు ఆ బండికి నంబర్ ప్లేట్ కూడా లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అటువంటి బండ్లను సీజ్ చేయాలని కోరుతున్నారు. ఓ నెటిజన్ ఇలా స్పందించాడు.. ఇటీవల ట్రాఫిక్ క్రమశిక్షణ అంతా పాటించాల్సిందే. జరిమానా పైసా వసూల్ మాదిరిగా కాకుండా నామినల్ గా ఉండాలి. గచ్చిబౌలి బిజినెస్ స్కూల్ రోడ్డులో, క్యూ సిటీ రోడ్డులో 30 కిమీ స్పీడ్ లిమిట్ బోర్డు పెట్టి కొందరికి వెయ్యి జరిమానా వేస్తున్నారు. ఇది చాలా దారుణం అంటూ తన సమస్యను ప్రస్తావించాడు.

New Traffic Rule: బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక.. మీరు వాహనం నడిపేటప్పుడు ఇవి ధరించకపోతే భారీ జరిమానా.. ఏంటో తెలుసుకోండి..

మరో నెటిజన్ ఫన్నీగా ఇలా ట్వీట్ చేశాడు.. అంటే ఒకవేళ వర్షం పడ్తే జుట్టు తడవకూడదని ముందు జాగ్రత్తగా హెల్మెట్ కి బదులుగా కవర్ పెట్టుకున్నారేమో అంటూ ట్వీట్ చేశాడు. ఆ కవర్ లోపల హెల్మెట్ ఉందేమో అని మరొకరు ఇలా వివిధ రకాలుగా ట్వీట్లు చేశారు. తెలంగాణ పోలీసులు ఈ తరహాలో ట్రోల్ చేయడం, సినిమా వాటిని వినియోగించుకుని కొత్త కొత్త సెటైర్లు వేయడం ఇదే కొత్తకాదు. గతంలో కూడా పలుమార్లు చేశారు.

తప్పు చేసిన వారిని ట్రోల్ చేయడమే కాదు.. ప్రజల్లో రోడ్ సేఫ్టీ మీద అవగాహన పెంచేందుకు ట్విట్టర్ వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వివరాలు తమకు తెలియజేయాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందుకోసం 9490617346 వాట్సప్ నెంబర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచారు.

First published:

Tags: Greater hyderabad, Hyderabad Traffic Police, Traffic rules

ఉత్తమ కథలు