హోమ్ /వార్తలు /తెలంగాణ /

కోవిడ్ ఫండ్ పేరుతో చర్చి పాస్టర్ కు కాల్.. ప్రాసెసింగ్ చార్జీల పేరుతో భారీగా టోకరా..

కోవిడ్ ఫండ్ పేరుతో చర్చి పాస్టర్ కు కాల్.. ప్రాసెసింగ్ చార్జీల పేరుతో భారీగా టోకరా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

United States: కరోనా ఫండ్ పేరిట యువతి పాస్టర్ కు టోకరా ఇచ్చింది. తమ దేశం నుంచి కోవిడ్ సమయంలో ఇబ్బందులు పడిన వారికి సహాయం అందిస్తామని నమ్మించింది. తాము.. ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు అందిస్తున్నట్లు తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

M.Balakrishna, News18, Hyderabad)


దేశంలో  రోజురోజుకి సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పోప్ ఫ్రాన్సిస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పేరిట 1.7 లక్షల సైబర్ మోసగాళ్లు ఒక పాస్టర్ నుంచి కోట్టేశారు. $50,000 (సుమారు 40 లక్షలు) కోవిడ్-19 ఫండ్ ఇస్తామ‌ని న‌మ్మించి ప్రాసెసింగ్ ఫీజులు ఇత‌ర  సాకుల‌తో దాదాపు 1.7 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. చందానగర్‌కు చెందిన పాస్టర్ కొట్టెంకాడి జోసెఫ్ పాల్ (27) జూలై 21న, పాస్టర్‌కు యుఎస్‌ఎకు చెందిన రెవ. సిస్టర్ కాలిస్టా లిసా అనే పేరుతో ఒక మ‌హిళ వాట్సాప్ మెసేజ్ చేసింది. కోవిడ్ స‌మ‌యంలో ఇబ్బందులు ప‌డిన క్రైస్తవులందరూ, హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు $10 బిలియన్లను విరాళంగా అందించారు.


అందులో కొంత భాగాన్ని మేము మీకు పంపించాల‌ని అనుకుంటున్నాము అని తెలిపింది. మీ చ‌ర్చ్ వివ‌రాలతోపాటు మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు కూడా పంపించాల‌ని కోర‌డంతో బాధితుడు త‌న‌  ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID తోపాటు బ్యాంక్ ఖాతా వివరాలు,మొబైల్ నంబర్‌ను పంపించారు. వివ‌రాలు పంపిన త‌రువాత ఆ మ‌హిళ మీ చ‌ర్చ్ కు  $50,000 మొత్తం అప్రూవ్ అయింద‌ని మ‌ళ్లీ మెసెజ్ చేసింది.  అయితే బదిలీ RBI ద్వారా జరగాలి. బదిలీ కోసం RBI అధికారులు మిమ్మ‌ల్ని సంప్రదిస్తార‌ని తెలిపింది. $50 000ని ఇండియ‌న్ కరెన్సీగా మార్చి మీ ఖాతాలోకి జమ చేస్తారని ఆ మహిళ పాస్టర్‌కి తెలియజేసింది. ఆగస్ట్ 20, 2022న, RBI బదిలీ విభాగం నుంచి అని చెప్పుకొని ఒక వ్య‌క్తి కాల్ చేశాడు. హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ, మీ ఖాతాకు బదిలీ చేయడానికి $50,000 పెండింగ్‌లో ఉందని చెప్పాడు.యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌తో లాగిన్ ఇచ్చాడు. మేము కన్ఫర్మేషన్ కోడ్ పంపుతామ‌ర‌ని అయితే దానికి కోసం పాస్ట‌ర్ కొంత డ‌బ్బు చెల్లించాల‌ని కోరాడు.  దీంతో పాస్ట‌ర్ ఆగస్టు 20, 24 మధ్య రెండు లావాదేవీలలో 1,70,000 వారు ఇచ్చిన ఖాతాలకు బదిలీ చేశాడు. మళ్లీ, కన్ఫర్మేషన్ కోడ్ పొందడానికి 1,37,000 డిపాజిట్ చేయమని కోరాడంతో అనుమానం వ‌చ్చిన పాస్ట‌ర్ బ్యాంక్ అధికారుల‌ను సంప్ర‌దించాడు. ఇలా ఫండ్ ట్రాన్స్ఫ‌ర్ చేయ‌డానికి ఎవ‌రు డ‌బ్బులు అడ‌గ‌ర‌ని బ్యాంక్ అధికారులు చెప్ప‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌ దగ్గరకు వెళ్లి జ‌రిగిందంతా చెప్పాడు బాధితుడు.  సంఘ‌ట‌న పై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.  కాల్స్ ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి వీళ్ల మోడ్ ఆఫ్ ఆప‌రేష‌న్ ఎలా ఉంటుంది అనే విష‌యాలపై ఆరా తీస్తున్నారు.  ఇదే త‌ర‌హా మోసాలు ఇంత‌కుముందు జ‌రిగాయా అనే అంశాల‌ను కూడా పోలీసులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, CYBER FRAUD, Hyderabad, Telangana News