Home /News /telangana /

Cyber crime : సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్... అవును మోసం చేశాను.. ఏం చేస్తావ్... అంటూ...!

Cyber crime : సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్... అవును మోసం చేశాను.. ఏం చేస్తావ్... అంటూ...!

cyber crime

cyber crime

Cyber crime : సైబర్ క్రైం నేరగాళ్లు మోసం చేయడమే కాదు.. బాధితులను సైతం బెదిరిస్తున్నారు.. ( cyber criminial threaten victim ) అవును మోసం చేశాను...ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తీవ్ర బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు... దీంతో సైబర్ వలకు చిక్కుకున్న ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

ఇంకా చదవండి ...
    డబ్బు సంపాదించడమే ధ్యేయంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్.. ఆన్‌లైన్ పేరుతో అనేక మోసాలకు తెరతీస్తున్నారు... వ్యక్తుల మానసిక బలహీనతలే పెట్టుబడిగా కొనసాగిస్తూ... గిఫ్టులు, వ్యాపారాలు, సర్వీసుల పేరుతో బురిడి కొట్టిస్తున్నారు.( cyber criminial threaten victim ) అయితే ఇలా బురిడి కొట్టించిన వారు.. బాధితుడి నుండి డబ్బులు తీసుకున్న తర్వాత సైలంట్ అవుతారు. తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు... కాని తాజాగా హైదారాబాద్‌లో జరిగిన సంఘటనలో మాత్రం సైబర్ నేరగాడు బాధితుడిని సైతం బెదిరించాడు. ( cyber criminial threaten victim ) అవును డబ్బులు దోచుకున్నాము... మేము చేసింది మోసమే... ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.

    దీంతో బాధితుడు లబోదిబోమంటూ మంగళవారం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
    వివరాల్లోకి వెళితే... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి డేటింగ్ కోసం ముచ్చట పడ్డాడు... ఇందుకోసం లోకంటో అనే డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అందులో ఆయుర్వేద మెసేజ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. ఇందుకోసం రూ. 2500 చెల్లించాడు.


    Rangareddy : రాయితో కొట్టి ..కొనఊపిరితో ఉన్నాడంటూ 100 డయల్ చేసిన ఓ బాలుడు


    ఇక బాధితుడి మానసిక స్థితిని క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రైం మోసగాళ్లు తెరతీశారు... కనీసం మాసజ్ సెంటర్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోకుండా... వారి వలలో చిక్కుకున్న బాధితుడికి ఫోన్ చేసి ఆ తరువాత పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అంటూ రూ.40 వేలు తీసుకున్నారు. ( cyber criminial threaten victim ) సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ.. మెయింటెనెన్స్ అంటూ ఇలా రకరకాల పేర్లు చెబుతూ రూ.1.9 లక్షలు కాజేశారు. అంతా అయి పోయిన తర్వాత... మాదాపూర్‌లో మసాజ్‌ సెంటర్‌ ఉందంటూ సైబర్‌నేరగాళ్లు చెప్పడంతో అప్పుడు అక్కడికి వెళ్లి... ఎంక్వయిరీ చేశాడు.. ( cyber criminial threaten victim ) దీంతో అసలు మసాజ్ సెంటర్ లేదని తెలుసుకుని షాక్ అయ్యాడు.. తాను మోసపోయానని తన డబ్బులు వాపస్‌ ఇవ్వాలంటూ తిరిగి సైబర్ నేరాగాళ్లకు ఫోన్ చేశాడు.. వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.


    Breaking : నల్లా.. నీళ్లలో కుళ్లిపోయిన శవం.. వాటర్‌ ట్యాంకు లోపల దారుణం..!


    అప్పుడు సైబర్ నేరగాళ్లు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు... అవును తాము రోజు చేసే పని ఇదే.. ఇలాంటి మోసాలే చేస్తాం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ సైబర్‌నేరగాళ్లు అల్టిమేటం ఇచ్చి ఫోన్‌ కట్‌ చేశారు...( cyber criminial threaten victim ) దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి అవే విషయాలను పోలీసులకు తెలిపాడు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

    ఇలా గూగుల్ సెర్చ్ పేరుతో కూడా ఓ బాధితుడు లక్ష రూపాయలను పోగొట్టుకోవడంతో పాటు నగరంలో గత రెండు మూడు రోజుల్లో ఐదు సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CYBER CRIME, Hyderabad

    తదుపరి వార్తలు