హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber Fraud : రైతులను వదలని సైబర్ నేరగాళ్లు .. గిర్ ఆవుల అమ్మకం పేరుతో ఎంత నొక్కేశారో తెలుసా

Cyber Fraud : రైతులను వదలని సైబర్ నేరగాళ్లు .. గిర్ ఆవుల అమ్మకం పేరుతో ఎంత నొక్కేశారో తెలుసా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Cyber Fraud: ఇప్పటి వరకు ఉద్యోగాలు, కరెంట్ బిల్లులు, లోన్‌లు, బిజినెస్ కాంట్రాక్టుల పేరుతో చీటింగ్ చేసిన కేటుగాళ్లు చివరకు రైతులను కూడా వదలడం లేదు. హైదరాబాద్‌కు చెందిన ఓ రైతుకు వాటిని ఆశ చూపించి డబ్బులు కాజేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మోసగాళ్లు కొత్తదార్లు వెదుకుతున్నారు. తమ మాటలకు, వేస్తున్న ఉచ్చులో పడే అమాయకులను సెలక్ట్ చేసుకొని మరీ వాళ్ల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు, కరెంట్ బిల్లులు, లోన్‌లు, బిజినెస్ కాంట్రాక్టుల పేరుతో చీటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు(Cyber criminal)చివరకు రైతులను కూడా వదలడం లేదు. హైదరాబాద్‌(Hyderabad)శివారు ప్రాంతానికి చెందిన ఓ రైతు(Farmer)ను అత్యంత చాకచక్యంగా మోసం చేశాడో సైబర్ నేరగాడు. రైతుకు ఏం ఇస్తానని ఎంత డబ్బులు రాబట్టుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు.

వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా.. ఈ ఫోన్లలో ఇకపై WhatsApp బంద్.. లాస్ట్ డేట్ వివరాలురైతునీ వదలని సైబర్ నేరగాళ్లు..

ప్రస్తుతం ఉన్న హైటెక్ కాలంలో మోసాలకు అంతే లేదు అన్నట్లుగా మారిపోయింది. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో ...ఎవరు చెప్పేది నిజమో...ఎవరు మోసం చేస్తున్నారో తెలియని అయోమయం నెలకొంది. హైదరాబాద్‌ ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ రైతును ఎంతో టెక్నిక్‌గా బుట్టలో వేసుకున్నారు సైబర్ మోసగాళ్లు. ఆవుల అమ్మకం పేరుతో రైతును తమ మాటలతో నమ్మించారు. బాధిత రైతు దగ్గర నుంచి 80 వేల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఈ కొత్త తరహా మోసం గురించి తెలుసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులే అవాక్కయ్యారు.

తక్కువ ధరకే అవులిస్తామని..

ఆవుల్లో అత్యధికంగా పాలు ఇచ్చే గిర్ జాతి ఆవులు తమ దగ్గర ఉన్నాయని...వాటిని పోషించే ఆర్ధిక స్తోమత లేని కారణంగా తక్కువ ధరకే అమ్మేస్తున్నామని ఓ సైబర్‌ కేటుగాడు సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు. గిర్ ఆవును కొనాలనుకునే వాళ్లు ఈ క్రింది ఫోన్‌ నెంబర్‌కు వాట్సాప్ కాల్ చేయమని ఇచ్చిన ప్రకటనను ఇబ్రహీంపట్నంకు చెందిన రైతు చూశాడు. వెంటనే ప్రకటనలో ఉన్న ఫోన్‌ నెంబర్‌కి వాట్సాప్ కాల్ చేసి తాను రైతునని గిర్ ఆవులను తాను కొనుగోలు చేస్తానంటూ చెప్పాడు.

80వేలు కాజేసిన కేటుగాడు..

రైతు మాటలతో అవతలి వ్యక్తి వీడియో కాల్ చేసి షెడ్డులో ఉన్న గిర్‌ ఆవులను చూపించా డు. వాటి పొదుగులను చూపించి ఒక్కో ఆవు రోజుకు 20లీటర్ల పాలు ఇస్తుందని రైతును నమ్మించాడు. ఒక్కో ఆవు ధర లక్షరూపాయలు కాని తాను 50వేలకే అమ్మేస్తున్నానని చెప్పాడు. డబ్బులు తనకు పంపితే డీసీఎం వ్యాన్‌లో ఆవులను పంపిస్తానని నమ్మించాడు. సైబర్ నేరగాడు చెప్పిన మాటలకు కనెక్ట్ అయ్యాడు రైతు. గుడ్డిగా అతడి మాటలు నమ్మి మోసగాడు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కి 80వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.

OMG: ప్రభుత్వ ఉద్యోగినా.. మజాకా.. రూ. 8 లక్షల డీజిల్ తాగేసిన మునిసిపల్ సిబ్బందిపోలీసుల్ని ఆశ్రయించిన బాధితుడు..

డబ్బులు అందగానే గిర్ జాతి ఆవులను విక్రయిస్తానని చెప్పిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో రైతు ఖంగుతిన్నాడు. తాను మోసపోయినట్లుగా తెలుసుకొని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. రైతు ఇచ్చిన ఫోన్ నెంబర్‌ ఆధారంగా టెక్నికల్ సాయంతో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: CYBER FRAUD, Hyderabad news

ఉత్తమ కథలు