Home /News /telangana /

HYDERABAD CYBER CRIME WOMAN DUPED RS 14 LAKHS IN THE NAME OF GIFT IN HYDERABAD SU

రెండో పెళ్లి చేసుకోవాలని చూసిన మహిళకు భారీ షాక్.. ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొదటి పెళ్లితో మోసపోయిన ఓ మహిళ.. రెండో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం ఓ మ్యాట్రిమోని సైట్‌లో రిజిస్టర్ కూడా చేసుకుంది.

    మొదటి పెళ్లితో మోసపోయిన ఓ మహిళ.. రెండో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం ఓ మ్యాట్రిమోని సైట్‌లో రిజిస్టర్ కూడా చేసుకుంది. అయితే ఇలా చేసిన మహిళన ఊహించని షాక్ తగిలింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన ఓ వ్యక్తి.. ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. తన మాయ మాటలతో నమ్మించి ఆమె వద్ద నుంచి రూ. 14 లక్షలు కాజేశాడు. చివరకు తాను మోసపోయాయని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. మల్కాజ్‌గిరికి చెందిన ఓ మహిళ.. రెండో పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోని సైట్‌లో తన ప్రొఫైల్‌ను ఉంచింది. ఆ ప్రొఫైల్ చూసిన ఓ కేటుగాడు ఆమెను నమ్మించి.. బురిడి కొట్టించాడు.

    తొలుత మహిళ నెంబర్ తీసుకున్న అతడు.. ఆమె వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. తన పేరు అనికేత్ అని పరిచయం చేసుకున్నాడు. లండన్‌లో ఉద్యోగం చేస్తున్నట్టుగా చెప్పాడు. తన భర్యా చనిపోయిందని, 10 ఏళ్ల కొడుకు ఉన్నాడని తెలిపాడు. అంతేకాకుండా ఆమె ప్రొఫైల్ నచ్చిందని.. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ మాటలు నమ్మిన మహిళ.. అతనితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది.

    ఇక, అవతలి కొద్ది రోజుల తర్వాత తన ప్లాన్‌ను అమలు చేశాడు. లండన్ నుంచి కంటి అద్దాలకు సంబంధించిన ఫ్రేమ్‌ను గిఫ్ట్‌గా పంపిస్తున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత రోజు మహిలకు కస్టమ్స్ అధికారుల పేరుతో ఓ ఫోన్‌ వచ్చింది. ‘మీకు లండన్‌ నుంచి పార్సిల్‌ వచ్చింది.. ప్రాసెస్‌ ఫీజు కింద రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది’అని ఫోన్ చేసిన వ్యక్తులు మహిళకు చెప్పారు. ఆ తర్వాత మరికాసేపటికి ఫోన్ చేసి.. పార్సిల్‌లో విదేశీ కరెన్సీ కూడా ఉంది, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుంటే కేసు అవుతుందని బెదిరించారు.

    అయితే మహిళ మాత్రం తనకు పార్సిల్ వద్దని చెప్పింది. అయినా వినిపించకుండా ఆమెకు ఫోన్‌లు చేశారు. ఇలా ఆమె వద్ద నుంచి రూ. 14 లక్షలు ఆన్‌లైన్ ద్వారా కాజేశారు. తాను మోసపోయినట్టుగా గుర్తించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CYBER CRIME, Hyderabd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు