HYDERABAD CYBER CRIME POLICE ARRESTED MAN FOR MOLESTING A WOMAN IN HYDERABAD SU
Hyderabad: రాత్రి పూట మెసేజ్.. మీ అమ్మాయి ఫొటోలను వైరల్ చేస్తా.. వీడు మాములోడు కాదు..
ప్రతీకాత్మక చిత్రం
ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్స్ క్రియేట్.. చేసి ఓ మహిళను తీవ్రంగా వేధించాడు. ఆమె కూతురు ఫొటోలను మార్పింగ్ చేసి వైరల్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.
ఓ మహిళకు రాత్రి పూట ఓ మెసేజ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన ఆ మెసేజ్‌లో క్రేజీ చాట్ చేయాలని ఉంది. అయితే ఇందుకు ఆమె తిరస్కరించడంతో వేధింపులు మొదలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు. వివరాలు.. నగరంలోని సంజీవరెడ్డి నగర్(SR Nagar)కు చెందిన మహిళకు ఆదివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అయితే తనకు తెలియని ఖాతా నుంచి ఆ మెసేజ్ వచ్చింది. అందులో క్రేజీ చాట్ చేయాలని పేర్కొన్నారు.
దీంతో ఆమె దానిని తిరస్కరించింది. అనంతరం తనకు మెసేజ్ వచ్చిన అకౌంట్‌ను బ్లాక్ చేసింది. అయితే ఆ తర్వాత మరో అకౌంట్ నుంచి కొన్ని ఫొటోలు వచ్చాయి. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపిచాడు అవతలి వ్యక్తి. అలాగే ఓ సినీ నటి ఫొటోను కూడా పంపించాడు. దీంతో ఆమె ఆ ఖాతాను కూడా బ్లాక్ చేశారు. అయిన కూడా అవతలి నుంచి వేధింపులు కొనసాగాయి.
ఆ తర్వాత మరో ఖాతా నుంచి మళ్లీ ఆమెకు మెసేజ్ వచ్చింది. ఈ సారి ఆమె కూతురు చిత్రాన్ని మార్ఫింగ్ చేసి పంపించాడు. తనను తిరస్కరిస్తే.. మీ కూతురు చిత్రాలను వైరల్ చేస్తానంటూ అవతలి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆందోళన చెందిన బాధిత మహిళ.. హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇక, నిందితుడిని నాగర్ కర్నూలు జిల్లా గుండూరుకు చెందిన మొగిలి ఆంజనేయులుగా గుర్తించారు. అతడు హైదరాబాద్ కొత్తపేటలో నివాసముంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి.. మహిళలను ఫాలో అవ్వడం అతడు పనిగా పెట్టుకున్నాడు. మహిళతో చాటింగ్ చేయడం.. వారు ఒకవేళ బ్లాక్ చేస్తే వేధింపులకు, బెదిరింపులకు పాల్పడేవాడు. వారి డీపీలు తీసుకుని వాటిని మార్పింగ్ చేసి.. నగ్నంగా తనకు కనిపించాలని లేకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ వేధింపులకు దిగేవాడు. ఇప్పటివరకు అతను దాదాపు 15 మంది మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసినట్టుగా సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.