Home /News /telangana /

HYDERABAD CYBER CRIME MAN CHEATED BY 79 THOUSAND RUPEES AFTER GETTING CALL IN THE NAME OF CUSTOMER CARE SU

Cyber Crime: మొబైల్‌ తప్పుగా వచ్చిందని కాల్.. రూ. 79 వేలు మాయం.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి.. తాను బుక్ చేసింది కాకుండా వేరే మొబైల్ వచ్చింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణమాల్లో అతడు రూ. 79 వేలు మోసపోయాడు.

    సైబర్ నేరగాళ్లు జనాలను బురిడి కొట్టించడానికి రోజురోజుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వారిని నమ్మించే విధంగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కస్టమర్ కేర్‌కు కాల్ చేసిన ఓ వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అతని కాల్ చేసి రూ. 79 వేలు దోచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌కాలనీలో నివసించే తాళ్లరెడ్డి ప్రకాశ్‌ షాప్‌ మై మొబైల్‌ అనే వెబ్‌సైట్‌లో ఓ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ఇందుకోసం తన HDFC క్రెడిట్ కార్డు ద్వారా రూ. 4,999 చెల్లించాడు. మే 30వ తేదీన అతనికి ఆర్డర్ డెలివరీ అయింది. అయితే అందులో అతడు ఆర్డర్ చేసిన మొబైల్‌కు బదులు వేరేది వచ్చింది.

    దీంతో అతడు వెంటనే కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. అయితే వాయిస్ క్లారిటీ లేకపోవడంతో ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వేరే నెంబర్ ‌నుంచి ప్రకాశ్‌కు ఫోన్ వచ్చింది. అవతలి వారు తాము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్టు ప్రకాశ్‌కు చెప్పారు. పొరపాటు వేరేవారికి పంపాల్సిన ఫోన్ అతని పంపినట్టు చెప్పి నమ్మించారు. పొరపాటు జరిగిందని.. తాను ఆర్డర్ చేసిన డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. ఇందుకోసం మొబైల్ ఆర్డర్ చేసిన సమయంలో వినియోగించిన అకౌంట్ వివరాలు చెప్పాలని కోరారు.

    అవతలి వ్యక్తి చెబుతున్న మాటలు నిజమేనని నమ్మిన ప్రకాశ్.. తన హెచ్‌డీఎఫ్‌సీ కార్డు వివరాలు తెలియజేశాడు. తరువాత అదే వ్యక్తి మళ్లీ ప్రకాశ్‌కు ఫోన్ చేసి నెట్ వర్క్ సమస్య ఉందని, మరో ఖాతా వివరాలు చెప్పాలని కోరాడు. దీంతో ప్రకాశ్.. తన యాక్సిస్ బ్యాంక్ కార్డు వివరాలు చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి వెంటనే డబ్బులు క్రెడిట్ అవుతాయని ఫోన్ కట్ చేశాడు.

    Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నాలాలో పడి బాలుడి మృతి.. మరమ్మత్తు పనులు జరుగుతుండగా..

    ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ప్రకాశ్‌కు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు నుంచి రూ.50,774, రూ.8226, యాక్సిక్‌ బ్యాంకు కార్డు నుంచి రూ. 20,310 డెబిట్ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాక్ తిన్న ప్రకాశ్.. తాను మోసపోయినట్టు తెలుసుకున్నాడు. వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్లకు ఫోన్ చేసి కార్డులను బ్లాక్ చేయించాడు. ఆ తర్వాత ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు