ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి సైతం ఆండ్రాయిడ్ ఫోన్ మెంటైన్ చేస్తూ.. ఆన్ లైన్ లావా దేవీలు జరుపుతున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో ఏ మూలకు వెళ్లిన మనకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో వస్తున్నాయి, బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు, రైళ్లతో పాటు రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్.... సినిమా హాల్స్ వద్ద కూడా వైఫై సేవల్ని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే టెక్నాలజీ ఏ రేంజ్‌లో పెరుగుతోందో... అదే రేంజ్‌లో సైబర్ క్రైమ్ కూడా పెరుగుతుంది. సైబర్ నేరగాళ్లు ఏ చిన్న అవకాశాన్ని వదులకోవటం లేదు. మారుతున్న ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని యధేచ్చగా దోపిడీలకు తెరలేపుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ఫ్రీ వైఫైని ఓ షాపింగ్ మాల్ లో వినియోగించుకున్న ఓ విద్యార్థి తన ఖాతాల నుంచి రూ.60వేలు పోగొట్టుకున్నాడు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా లైక్‌లు, రివ్యూల పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీ వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకొని వారిని టార్గెట్ చేసుకుంటూ దోచుకుంటున్నారు. మీకు ఏ ఉద్యోగం లేకపోయినాఇంటి వద్దే నుంచే రూ.20వేల నుంచి రూ. 30 వేల వరకు సంపాదించవచ్చునని కల్లబొల్లి మాటలు చెప్పి నిలువునా దోచేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. యూ ట్యూబ్, సినిమాలకు రివ్యూలు చెప్పే రూ. 7వేల నుంచి రూ. 9వేల వరకు ఇస్తామని నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. దీనిని నమ్మిన అల్వాల్‌లోని ఓ బాధితులు కొన్ని వీడియోలకు రివ్యూలు చెప్పి రూ. 19వేలు సంపాదించిన తరువాత సైబర్‌నేరగాళ్లు పలు రకాల లింకులు పంపి అతని ఖాతాల్లోని డబ్బులు ఖాజేశారు.
లైక్‌లు, రివ్యూల పేరుతో మొదట మంచిగా మాట్లాడి కొంత నగదు వారి వ్యాలెట్ రూపంలో జమ చేస్తూ ఆ తరువాత పెద్దమొత్తంలో ఇంకా డబ్బులు కావాలంటే మేము చెప్పే లింకులను ఓపెన్ చేయాలని తదితర వివరాలు తెలుసుకుని నిండా ముంచుతున్నారు. దీంతో సైబర్‌గాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వారు ఇచ్చిన మొబైల్ నెంబర్లకు ఫోన్లు చేయగా స్విచ్ఛాప్ వస్తుంది. దీంతో చేసేది ఏమీ లేక పోలీసులను సంప్రదిస్తున్నారు.
నగరంలో చాలా మంది బాధితులు మూడు కమిషనర్లరేట్లలో ఫిర్యాదు చేశారు. నగరంలో ఈ మధ్యకాలం లో సైబర్ నేరగాళ్లు సామాజిక మధ్యమాల్లో వచ్చే వీడియోలకు ఒక్క లైక్ చేస్తే రూ.5 నుంచి రూ.10ల వరకు ఇస్తామని మొదట డబ్బులు ఇస్తున్నారు. దానికి ఆశపడిన వారు తరువాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన తరువాత వారు చెప్పినట్లు చేసి లక్షల్లో మునుగుతున్నారు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. ఇలాగే సిటీలోని మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైతం కూడా రివ్యూల పేరుతో కొంత డబ్బులు సంపాదించి రూ. 2ల లక్షల వరకు మోసపోయాడు.
దీంతో సైబర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టడానికి ఆన్‌లైన్లే వారి వేదిక అని అందుకే ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Cyberabad, Hyderabad, Local News