హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: లోదుస్తుల్లో దాచి... రూ.47 లక్షల బంగారం స్మగ్లింగ్..

Hyderabad: లోదుస్తుల్లో దాచి... రూ.47 లక్షల బంగారం స్మగ్లింగ్..

లోదుస్తుల్లో దొరికిన బంగారం

లోదుస్తుల్లో దొరికిన బంగారం

Hyderabad: రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కేజీ రెండు కేజీలు కాదు.. ఏకంగా 15 కిలోల అక్రమ బంగారం చిక్కింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బంగారం అక్రమ రవాణాకు అంతర్జాతీయ విమానాశ్రయాలు వారధిగా మారుతున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌, డీఆర్ఐ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం లేదు. విమానాశ్రయాల్లో నిత్యం బంగారం పట్టుబడుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) అక్రమ బంగారం రవాణా ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా శనివారం కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

కొండగట్టు అంజన్న భద్రమేనా? చోరికి అధికారుల వైఫల్యమే కారణమా

దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఈకే 528 విమానంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ముందస్తు సమాచారం నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి వచ్చిన పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి వద్ద భారీగా బంగారం దొరికింది. అతడు తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచి.. దుబాయ్ నుంచి నగరానికి తీసుకొచ్చాడు. అతడి నుంచి 823 గ్రాముల బంగారు ముద్దను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆ బంగారం విలువ రూ.47 లక్షల ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కేజీ రెండు కేజీలు కాదు.. ఏకంగా 15 కిలోల అక్రమ బంగారం చిక్కింది. సూడాన్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేయగా..వారి బూట్లలో బంగారం కనిపించింది. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి దాదాపు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆ బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీజ్‌ చేసిన బంగారంలో... ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

First published:

Tags: Hyderabad, Local News, Shamshabad Airport, Telangana

ఉత్తమ కథలు