శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో భారీగా బంగారం పట్టుబడింది. కేజీ రెండు కేజీలు కాదు.. ఏకంగా 15 కిలోల అక్రమ బంగారం చిక్కింది. బూట్లలో బంగారం దాచి..కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి.. బంగారం తరలించాలనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసికొట్టి.. చివరకు చిక్కిపోయారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో సాధారణంగానే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కస్టమ్స్ అధికారులు ఎప్పటిలాగే ఇవాళ కూడా ప్రయాణికులను చెక్ చేశారు.
కరువు ప్రాంతంలో కూడా కాసులు కురిపిస్తున్న స్ట్రాబెర్రీ సాగు.. లాభాలు ఎలా ఉన్నాయంటే
సూడాన్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేయగా.. ఏదో తేడాగా అనిపించింది. మెటల్ డిటెక్టర్లు సౌండ్ చేయడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. వారందరిని తనిఖీ చేశారు. దుస్తులు, బూట్లు..దేనినీ వదల్లేదు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే.. బూట్లలో దాచిన బంగారం బండారం బయటపడింది.
షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి దాదాపు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆ బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీజ్ చేసిన బంగారంలో... ఇదే అత్యధికమని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Shamshabad Airport, Telangana