హోమ్ /వార్తలు /తెలంగాణ /

రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ యత్నం..కూనంనేని, చాడ అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ యత్నం..కూనంనేని, చాడ అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

సీపీఐ రాజ్ భవన్ ముట్టడికి యత్నం

సీపీఐ రాజ్ భవన్ ముట్టడికి యత్నం

సీపీఐ చేపట్టిన ఛలో రాజ్ భవన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని పెద్ద ఎత్తున సిపిఐ నేతలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సిపిఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ సర్కిల్ వద్ద సిపిఐ నేతల బైఠాయింపుతో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సీపీఐ (CPI) చేపట్టిన ఛలో రాజ్ భవన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని పెద్ద ఎత్తున సిపిఐ (CPI) నేతలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సిపిఐ (CPI) కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ సర్కిల్ వద్ద సిపిఐ (CPI) నేతల బైఠాయింపుతో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambha shivarao), మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy)ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సిట్

ఛలో రాజ్ భవన్ కు పిలుపు..

కాగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ  (CPI) ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో పాలనకు ప్రయత్నిస్తుందని సిపిఐ  (CPI) నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ , కేరళ , బెంగాల్ లో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. అయితే గవర్నర్ పాలనను రద్దు చేయాలని దీనికై గవర్నర్ రాజ్ భవన్ ను బుధవారం ముట్టడించాలని సిపిఐ  (CPI) పిలుపునిచ్చింది.

జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర..కేసీఆర్ బహిరంగ సభకు భారీ కాన్వాయ్ లో బయలుదేరిన కవిత

రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు..

కాగా సిపిఐ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు మోహరించారు. రాజ్ భవన్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ కు వచ్చే క్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ లో సిపిఐ  (CPI) నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. అయినా కానీ కొంతమంది పోలీసులను తప్పించుకొని రాజ్ భవన్ వైపు వెళ్లారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళలను లేడీ కానిస్టేబుళ్లు అక్కడి నుండి తరలించారు. అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambha shivarao), మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసే క్రమంలో కూనంనేని సాంబశివ రావు కింద పడిపోయారు.

తెలంగాణ గవర్నర్ బీజేపీ నేత మాదిరిగా వ్యవహరిస్తున్నారని సిపిఐ  (CPI) నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ల సహాయంతో కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పరిణామాలను కమ్యూనిస్ట్ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు.

First published:

Tags: CPI, Hyderabad, Telangana

ఉత్తమ కథలు