కానిస్టేబుల్ అలా చెప్పడంతో షాకైన సీపీ.. ఆ తర్వాత ఏం చేశారంటే..

లాక్‌డౌన్‌లో భాగంగా అహార్నిశలు విధుల్లో శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులతో హైదరాబాద్ సీపీ కొద్దిసేపు ముచ్చటించారు. ఓ కానిస్టేబుల్ తనకు రెండు రోజుల క్రితం బాబు పుట్టాడు. అయినా ఇంటికి వెళ్లకుండా డ్యూటీ చేస్తుండడంతో సీపీ అభినందించారు.

news18-telugu
Updated: April 4, 2020, 1:40 PM IST
కానిస్టేబుల్ అలా చెప్పడంతో షాకైన సీపీ.. ఆ తర్వాత ఏం చేశారంటే..
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ను విజయవంతం చేసేందుకు పోలీసులు అహార్నిశలు శ్రమిస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం నిత్యం పోరాడుతున్నారు. కానిస్టేబుల్.. ఎస్ఐ అనే తేడా లేకుండా గత రెండు వారాలుగా రోడ్లపైనే పహారా కాస్తున్నారు. అయితే ఇంతటి వారి శ్రమకు ఏ చిన్నపాటి ప్రశంస అయినా కొండంత ఉత్సహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో చెక్ పోస్టులు, చౌరస్తాల్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్స్, అధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు.

వారి కుటుంబ నేపథ్యం, బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే లిబర్టీ వద్ద డ్యూటీ చేస్తోన్న నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సాయికిషన్‌తోనూ మాట్లాడాడు. ఈ క్రమంలో అతడు తనకు రెండురోజుల క్రితమే బాబు పుట్టాడని చెప్పడంతో సీపీ అంజనీకుమార్ ఆశ్చర్యకితులయ్యారు. ఇలాంటి సమయంలోనూ కుటుంబాన్ని వదిలిపెట్టి విధులకు హాజరైన సాయికిషన్‌ను మెచ్చుకున్నారు.

అంతటితో ఆగకుండా మిఠాయిలు, బిస్కట్లు ఇచ్చి సీపీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కానిస్టేబుల్ సాయి కిషన్ ఆనందానికి అంతులేదు. ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు సాయికిషన్ సీపీకి ధన్యవాదాలు తెలిపారు. సీపీ ఇచ్చిన ప్రోత్సాహంతో మరింతగా పనిచేస్తానని కానిస్టేబుల్ సాయికిషన్ చెప్పారు.
Published by: Narsimha Badhini
First published: April 4, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading