హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : వాట్సప్ చెకింగ్‌లపై హైదరాబాద్ సీపికి లీగల్ నోటిసులు..

Hyderabad : వాట్సప్ చెకింగ్‌లపై హైదరాబాద్ సీపికి లీగల్ నోటిసులు..

మంత్రి ఆదేశాలతో మేయర్ ఛాంబర్​లో బీభత్సం
ప్రజల ఆస్తిని ధ్వసం చేసినందుకు గానూ.. 32 మంది కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.  సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతో వచ్చిన భాజపా నాయకులు, కార్యకర్తలపై కూడా  కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు.

మంత్రి ఆదేశాలతో మేయర్ ఛాంబర్​లో బీభత్సం ప్రజల ఆస్తిని ధ్వసం చేసినందుకు గానూ.. 32 మంది కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతో వచ్చిన భాజపా నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపారు.

Hyderabad : వ్యక్తిగత వాట్సప్‌లు తనీఖీ చేయడంపై సీపి అంజనీకుమార్ కు లీగల్ నోటిసులు అందాయి. మాదక ద్రవ్యాలు, గంజాయి కోసం తనిఖీలు చేస్తున్న సమయంలో వాట్సప్‌లపై నిఘా పెట్టడడంపై ఓ ప్రైవసీ పరిశోధకుడు ఈ లీగల్ నోటిసులు పంపించారు.

మాదకద్రవ్యాలు, గంజాయి కోసం తనిఖీల సమయంలో పౌరుల వాట్సాప్‌ చాట్‌లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ నగరానికి చెందిన డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్‌ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు లీగల్‌ నోటీసులు (Legal notice to CP Anjani kumar) పంపారు. వెస్ట్‌జోన్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్‌ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. వీటి ఆధారంగా కె.శ్రీనివాస్‌ నోటీసులు(Legal notice to CP Anjani kumar) పంపారు.

అక్టోబరు 27న మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌, జుమేరాత్‌బజార్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు(telangana police drugs searching) చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు తక్షణమే గుర్తించాలని నోటీసులో కోరారు.పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటో డ్రైవర్ల వంటి సాధారణ పౌరులను ఆపడానికి, మొబైల్‌ ఫోన్లను తెరవమని అభ్యర్థించడానికి పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని తెలిపారు. సరైన కారణం లేకుండా పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు.

ఇది చదవండి : వీవీప్యాట్ వివాదంపై ఎన్నికల అధికారుల వివరణ.. అసలేం జరిగిందంటే..


కాగా ముఖ్యమంత్రితో పాటు సీఎం కేసిఆర్ ఆదేశాలతో గంజాయి సాగుతోపాటు స్మగ్లింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పోలీసులు చెకింగ్‌లో భాగంగా వాట్సప్‌లు తనిఖీలు చేశారు. ముఖ్యంగా వాట్సప్‌ల ద్వారా గంజాయితో పాటు డ్రగ్స్ ఆర్డర్స్ ఇవ్వడం లాంటి సంఘటనలతో పాటు యూపిఐ ద్వారా డబ్బులు చెల్లిస్తూ అక్రమ దందాలు కొనసాగిస్తుండడంతో తనిఖీలు చేస్తున్నట్టు సీపీ అంజన్ కుమార్ వివరించారు. ఇందులో బాగంగానే తనిఖీలు చేపట్టామని సంధర్భాన్ని బట్టి వ్యక్తిగత అంశాలను తనిఖీ చేసే అధికారం పోలీసులకు ఉందని ఆయన వివరించారు.

కాగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్‌లతో పాటు చాలా మందిని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజగా అరకు నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వైజాగ్​కు చెందిన వెంకటేష్, సుధాకర్ అరకు నుంచి రైలు మార్గం ద్వారా గంజాయిని మంచిర్యాల తీసుకొని వచ్చి ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని(telangana police seized Ganja) తెలిపారు.

First published:

Tags: Hyderabad, Hyderabad police, Telangana

ఉత్తమ కథలు