తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police department)ను కరోనా కలవరపెడుతోంది. పలు పోలీస్‌స్టేషన్స్‌లో సిబ్బంది కోవిడ్ పాజిటివ్ (Covid positive) గా తేలుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా కేసులు (Corona cases in Telangana) భయాందోళనకు గురి చేస్తున్నాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా నమోదైన కేసులు.. ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే వారికి కరోనా పాజిటివ్ (Corona positive)గా నిర్థారణవుతుండటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police department)ను కరోనా కలవరపెడుతోంది. పలు పోలీస్‌స్టేషన్స్‌లో సిబ్బంది కోవిడ్ పాజిటివ్ (Covid positive) గా తేలుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా థర్డ్‌వేవ్‌లో సుమారు 500 మందికి కోవిడ్ పాజిటివ్ (Covid cases)గా తేలింది. మొదటి దశలో 2,000 మందికి పోలీసులకు కోవిడ్ సోకింది. రెండో దశలో 700 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 50 మంది సిబ్బంది మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కేసులు (corona cases) భారీగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం వ్యాక్సినేషన్ (Vaccination) పూర్తయింది. బూస్టర్ డోస్‌ను సైతం వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రజాప్రతినిధులు, పోలీస్, ఆర్టీసీ సిబ్బందితోపాటు సామాన్యులూ వరుసగా కరోనా (Corona) బారినపడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొవిడ్ తో ఆస్పత్రిలో చేరగా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హోం క్వారంటైన్ లో ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రెండోసారి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ప్రయాణికులంతా (passengers) టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి.
ఒకే స్టేషన్లో 16 మందికి కరోనా..
మరోవైపు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar Police station)లో విధులు నిర్వహిస్తున్న 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ (Corona positive)గా నమోదవడం ప్రస్తుతం కలకలం రేపింది. ఎస్సై, ఏఎస్సైతో పాటు మరో 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. మాస్క్ లేకుండా ఎవ్వరూ కూడా పోలీస్ స్టేషన్లోకి రావొద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు దారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ ఆంక్షలు విధించారు.
కొత్తగా 2,047 పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజూకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,047 పాజిటివ్ కేసులు (Corona cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,057కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 1174 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కొవిడ్ టీకాల (Vaccination) పంపిణీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.