హైదరాబాద్‌లో ఓ కోవిడ్ పెషేంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకి బలవనర్మణం చెందాడు. వివరాలు.. వేములవాడకు చెందిన 77 ఏళ్ల నారాయణ.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యాపారిగా జీవనం సాగిస్తున్న అతడికి ఇద్దరు కొడుకులు. అయితే ఇటీవల కరోనా సోకడంతో కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆదివారం బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. నారాయణ ఆత్మహత్యతో ఆస్పత్రిలో ఉన్న పెషేంట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే కరోనా నిర్దారణ కావడంతో నారాయణ తీవ్ర నిరాశ చెందాడని, ఈ నేపథ్యంలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొందరు అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి యజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఆత్మహత్య చేసుకున్న పేషేంట్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్లో బుధవారం(జవనరి 13) చేరాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడ పనిచేస్తున్న నర్సు మెడికేషన్‌కు సిద్దం చేస్తోంది. అయితే ఆ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న కోవిడ్ 19 వార్డు నుంచి దూకి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన సిబ్బంది తీవ్రంగా నారాయణను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. అయితే లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందాడు" అని తెలిపింది.
ఇక, ఈ విషయం తెలిసి బాధితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారికి ఆస్పత్రి సిబ్బంది జీహెచ్ఎంసీ ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాన్ని అప్పగించారు. మరోవైపు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కొందరు భయంతో ప్రాణాలు తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో పలుచోట్ల కరోనా నిర్ధారణ అయిన కొందరు వ్యక్తులు ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Published by:Sumanth Kanukula
First published:January 18, 2021, 06:37 IST