news18-telugu
Updated: October 4, 2019, 4:53 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం తెచ్చిన కొత్త మోటార్ వాహన చట్టం జరిమానాల మోత మోగిస్తోంది. వేలకు వేలు ఫైన్లు వేస్తూ వాహనదారులకు జేబులకు చిల్లులు పెడుతోంది. తెలంగాణలో మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. భారీ జరిమానాలతో ప్రజలను ఇబ్బంది పెట్టలేమని తెలంగాణ సీఎం కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. దాంతో రోడ్డు భద్రతా నియామాలను ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీసులు పాత జరిమానాలే విధిస్తున్నారు. ఐతే హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మాత్రం కొత్త రూల్స్ ప్రకారమే అమలు చేస్తున్నట్లు తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి వారికి పాత జరిమానాలే ఏకంగా రూ.10,500 ఫైన్ విధిస్తున్నారు.
వాహన సవరణ చట్టం-2019ని హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులు పక్కాగా అమలు చేస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 9 మందికి గురువారం రూ.10,500 ఫైన్ వేశాయి. గత వీకెండ్‌లో పట్టుబడిన వారిని కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన చట్టం ప్రకారమే జరిమానాలు విధించారు. ఐతే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అధికారం కోర్టులకు ఉండడంతో దేశంలో ఎక్కడైనా కొత్త జరిమాలను విధించవచ్చని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మిగతా ఉల్లంఘనలకు మాత్రం పాత జరిమానాలనే విధిస్తున్నామని తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 4, 2019, 4:53 PM IST