హోమ్ /వార్తలు /తెలంగాణ /

Daggubati Rana: దగ్గుబాటి రానా, సురేష్‌బాబుపై క్రిమినల్ కేసు.. కోర్టు నుంచి సమన్లు..!

Daggubati Rana: దగ్గుబాటి రానా, సురేష్‌బాబుపై క్రిమినల్ కేసు.. కోర్టు నుంచి సమన్లు..!

రానా

రానా

Daggubati Rana: సురేష్ బాబు, రానా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీచేసింది. తుదపరి విచారణను విచారణను మే 1కి వాయిదా వేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌ (Hyderabad)లోని ఫిలింనగర్‌ స్థలం వివాదం మరో మలుపు తిరిగింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Suresh Babu), ఆయన కుమారుడు సినీ నటుడు రానా (Rana Daggubati)కు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మేందుకు తమ వద్ద డబ్బులు తీసుకొని.. రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రమోద్‌ కుమార్‌ అనే వ్యాపారి ముందుగా పోలీసులను ఆశ్రయించారు. ఐతే బంజారహిల్స్ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దానిని కాగ్నిజెన్స్‌గా తీసుకున్న కోర్టు.. సురేష్ బాబు, రానా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీచేసింది. తుదపరి విచారణను విచారణను మే 1కి వాయిదా వేసింది. ఐతే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Chiranjeevi: పవన్ కళ్యాణ్ నక్సలైట్ అవుతాడనుకున్నా.. షాకింగ్ విషయం రివీల్ చేసిన చిరంజీవి

షేక్‌పేట మండలం సర్వే నెం.403లో సినీ నటి మాధవికి చెందిన ఉన్న 1007 గజాలను సురేష్ బాబు కొన్నారు. ఆ ప్రాపర్టీని 2014లో ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి హోటల్‌ ఏర్పాటు కోసం లీజుకిచ్చారు. 2018 ఫిబ్రవరిలో లీజు ముగుస్తుండగా ప్లాట్‌ నెం.2లోని స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు అంగీకరించారు. ఈ క్రమంలో ప్రమోద్ కుమార్ రూ.5కోట్లు చెల్లించాడు. దీనికి సంబంధించి డీడ్‌ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత లీజు గడువు ముగిసినా.. ఖాళీ చేయడం లేదంటూ ప్రమోద్‌పై ఓ కేసు వేశారు. వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపించారు. అయితే తన వద్ద రూ.5కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని ప్రమోద్‌ కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అవి తేలకముందే.. గత ఏడాది ఆ స్థలాన్ని సురేష్ బాబు.. తన కుమారు రానాకు విక్రయించారు.

ఈ క్రమంలోనే నవంబరు 1న రానా పేరు చెప్పి కొందరు వ్యక్తులు.. ఆ స్థలంలోని సెక్యూరిటీ సిబ్బందిని తరిమివేశారు. ఖాళీ చేయాలని ప్రమోద్‌ను బెదిరించారు. అదే రోజున ప్రమోద్‌ బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో... నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రానా, సురేష్‌బాబుకు సమన్లు పంపించింది.

First published:

Tags: Daggubati Suresh, Local News, Rana daggubati, Tollywood

ఉత్తమ కథలు