గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal mla) రాజాసింగ్(Rajasingh)కు ఊరట లభించింది. పీడీ యాక్ట్(PD Act)కేసులో జైల్లో ఉన్న రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ (Bail)మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ఇకపై రాజాసింగ్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ గతంలో వీడియోలను సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసారు రాజాసింగ్. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యారు. పాత కేసులతో పాటు మరికొన్ని విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టారు. సుమారు 40రోజులకుపైగా జైలు జీవితం గడిపిన రాజాసింగ్‌కు ఇప్పుడు విముక్తి కలిగింది.
షరతులతో కూడిన బెయిల్ ..
రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ గతంలో వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టారు. అయితే ఆయనకు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం జైలు నుంచి విడుదలైన తర్వాత విద్వేష వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. సుమారు రెండు నెలల పాటు జైలు జీవితం గడిపిన రాజాసింగ్‌కు ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు. అయితే విడుదలైన తర్వాత ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు చేయకూడదని..అలాగే మీడియాతో మాట్లాడవద్దని కోర్టు సూచించింది.
రెండు నెలలుగా జైల్లో..
అంతే కాదు మూడు నెలల పాటు రాజాసింగ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టకూడదని ఆదేశించింది. ఆగస్ట్ 25వ తేదిన రాజాసింగ్ పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు విడుదల అవుతున్నారు. హైకోర్టు ఆర్డర్ కాపి వచ్చిన తర్వాత వెంటనే రాజాసింగ్‌ను విడుదల చేయాలని కోర్టు పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేష పూరిత కామెంట్స్ చేసినందుకే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ సెప్టెంబర్ 2వ తేదిన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రాజాసింగ్ సైతం లేఖ ద్వారా పార్టీ హైకమాండ్‌కు తన వివరణ ఇచ్చుకున్నారు.
సస్పెన్షన్ ఎత్తివేస్తారా..?
అటు బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు సైతం సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు కూడా చేపట్టారు. బెయిల్‌పై విడుదలవుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసే అంశంపై కూడా రెండు, మూడు రోజుల్లో ఓ స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది. రాజాసింగ్ భార్య ఉషాబాయీ బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి దీనిపై చర్చించి వెళ్లారు. ఇక సస్పెన్షన్ పై బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వగా.. దీనికి రాజాసింగ్ ఇది వరకే వివరణ ఇస్తూ లేఖ రాశారు. దీనిపై క్రమశిక్షణ సంఘం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raja Singh, Telangana News