కరోనా కష్టాలు గురించి మనకు బాగా తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా... రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్తంభించిపోయింది. వైరస్‌తో పోరాడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.చాలామంది బతికి బట్టకట్టారు. అయితే కరోనా వచ్చి పోయినా.. దాని దుష్ప్రభవాలు మాత్రం జనాల్ని వీడటం లేదు. కోవిడ్ బారిన పడి.. కోలుకున్న వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా కరోనా దుష్ప్రభావం పెల్విక్ హిప్‌పై కూడా ఉందని తోస (తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్) ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్.సోమశేఖర్‌రెడ్డి అన్నారు.
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో శనివారం ఏర్పాటు చేసిన తోస - తోసకాన్ 2023 వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా కారణంగా కలిగే దుష్ప్రభావాల్లో కటి ఎముకలకు పెల్విక్ హిప్ సమస్య కూడా ఏర్పడుతుందని, ఆటో ఇమ్యూన్ రియాక్షన్‌లకు, రియాక్టివ్ ఆర్థరైటిస్‌కు కూడా దారితీస్తుందన్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ఎముకులకు సంబంధించిన సమస్యలు గురించి ప్రస్తావంచారు. దీనికి సంబంధించిన నొప్పి సాధారణంగా తొడ ముందు భాగంలో కొన్ని సార్లు మోకాలిలో కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల రోగికి లేచి నిలబడటంలో మెట్లు ఎక్కడంలో ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు.
ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా 60కి పైగా స్టాల్స్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థోప్లాస్టీ, నాన్ యూనియన్ లాంగ్ బోన్స్, మణికట్లు, చేతి గాయాలు, పాదం, చీలమండ వంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Covid, Hyderabad, Local News