Home /News /telangana /

Kamareddy :తీరని కిట్ల కొరత.. అందోళన చేస్తున్న భాదితులు.. రోజు 50 మందికే పరీక్షలు

Kamareddy :తీరని కిట్ల కొరత.. అందోళన చేస్తున్న భాదితులు.. రోజు 50 మందికే పరీక్షలు

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆంధోళణ చేస్తున్న భాదితులు

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆంధోళణ చేస్తున్న భాదితులు

covid Tests : ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షల కోసం పోటెత్తుతున్న ప్రజలు... ..రోజుకు యాబై మందికి మాత్రమే పరీక్షలు చేస్తామంటున్న సిబ్బంది.. సరైన కిట్స్ లేక చేతులెత్తుతున్న వైద్య సిబ్బంది

రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పలు జిల్లాల్లో ఇంకా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా కిట్‌లు కొరత ఉందంటూ...ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కరోనా పరీక్షలకు ఎలాంటీ ఇబ్బంది లేదని చెబుతుంది. కాగా ఇప్పటికే రోజుకు లక్ష చొప్పున పరీక్షలు చేస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తన నివేదిక అందించింది.

అయితే ప్రభుత్వం చెబుతున్నట్టు గ్రౌండ్ లెవల్ మాత్రం కనిపించడం లేదు. కరోనా టెస్టుల కోసం రోజు వందలాది ఆరోగ్య కేంద్రాలకు వస్తుంటే..ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం రోజు యాబై టెస్టులు మాత్రమే చేస్తామని చెబుతున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన భాదితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం యాబై మందికే టెస్టులు నిర్వహించడం ద్వార ఇతరులు పెద్ద మొత్తంలో ఇబ్బందులకు గురవుతున్నారంటూ పలు కేంద్రాల్లో ఆందోళనకు దిగుతున్నారు. తమకు కరోనా లక్షణాలు ఉన్నా..పరీక్ష చేసుకునేందుకు ఆలస్యం అవుతుండడంతో సరైన సమయంలో చికిత్స చేయించుకోలేక పోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులుగా పరీక్షల కోసం తిరుగుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని దేవునిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద సుమారు 30 మంది కరోనా నిర్ధారణ కోసం వచ్చినా వారు ఆందోళనకు దిగారు. తాము గత రెండు, మూడు రోజులుగా ఆరోగ్య కేంద్రానికి వచ్చి కిట్లు అయిపోయాయని తిరిగి పంపిస్తున్నారని ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు.

ప్రతి రోజు 50 మందికి మాత్రమే కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. 50 మంది తరువాత వచ్చిన వారికి పరీక్షలు చేయకపోవడతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమకు అనారోగ్య లక్షణాలు ఉండడంతో పరీక్ష నిమిత్తం ఇక్కడికి వస్తే పరీక్ష చేయకుండా పంపిస్తే తాము ఎక్కడికి వెళ్ళాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది నిర్ధారణ కిట్ల కొరత ఉందని, కిట్లు ఉన్నమెరకే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి రోజు 50 మందికి మాత్రమే టోకెన్ లు ఇచ్చి వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు.నాలుగు రోజులు ఐనా పరీక్షా చేయపోతే మాపరిస్థితి దారుణంగా ఉందని బాధితుడు వాపోతున్నాడు..

మీ నగరం నుండి (​హైదరాబాద్)

తెలంగాణ
​హైదరాబాద్
తెలంగాణ
​హైదరాబాద్
Published by:yveerash yveerash
First published:

Tags: Corona cases, Nizamabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు