HYDERABAD CORONA SECOND WAVE SYMPTOMS ARE TOO DIFFERENT THAN PREVIOUS PATIENTS DOCTORS TOLD WEIRD FACTS FULL DETAILS HERE HSN
Corona Second Wave: దగ్గు, జ్వరమే కాదు.. కరోనా సెకండ్ వేవ్ లో గతానికి భిన్నంగా కొత్త లక్షణాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ప్రతీకాత్మక చిత్రం
కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో దగ్గు, జలుబు, జ్వరం వంటివి లక్షణాలుగా ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో భారత్ పై విరుచుకుపడుతోంది. రోజుకు 2 లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా ఉంటోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య గతేడాది కంటే ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. కేసులు అధికంగా ఉంటున్న చోట్ల లాక్ డౌన్ పెడుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ప్రజలంతా మాస్కులు ధరించేట్లు, సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతేడాది దగ్గు, జలుబు, జ్వరం, వాసనను పసిగట్టలేకపోవడం వంటి ఇతర లక్షణాలను కరోనా సోకిందనడానికి ప్రాథమిక అంచనాలు. కానీ కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం గతంలో కంటే భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి మొదటి దశలో కరోనా సోకిన తొమ్మిది నుంచి 14 రోజుల తర్వాత లక్షణాలు కన్పించేవి. కానీ ప్రస్తుతం అంత సమయం తీసుకోవడం లేదు. ప్రస్తుతం కరోనా బారిన పడుతున్న వారిలో నడుం నొప్పులు, కాళ్లు చేతులు గుంజడం, తల పట్టేసినట్టు ఉండటం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అదే విధంగా కరోనా సోకిన వాళ్లు దగ్గినప్పుడు వచ్చే తెమడలో రక్తపు చారికలు కూడా కనిపిస్తున్నాయట. ఎర్రగడ్డలో ఛాతీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా రోగుల్లో దాదాపు 30 మందిలో ఇవేలక్షణాలను గమనించినట్టు ఓ డాక్టర్ వెల్లడించారు. క్షయ, బ్రాంకైటీస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడేవారిలో ఈ లక్షణాలు ఉంటాయనీ, ప్రస్తుతం కరోనా బారిన పడిన వాళ్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించడం ఆశ్చర్యంగా ఉందని ఆ వైద్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా కరోనాను ఎదుర్కోవడం అనేది ప్రజల చేతుల్లోనే ఉందనీ, అందరూ జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ మహమ్మారి నుంచి బయటపడగలమని వైద్యులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.