హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Tims: కారిడార్లపైనే శవాలు.. మృతుల దిబ్బగా మారుతున్న టిమ్స్.. ఎనిమిది ఫ్లోర్లలో కరోనా రోగులతో కిక్కిరిసిన టిమ్స్.. ఆందోళనకరంగా పరిస్థితులు..

Hyderabad Tims: కారిడార్లపైనే శవాలు.. మృతుల దిబ్బగా మారుతున్న టిమ్స్.. ఎనిమిది ఫ్లోర్లలో కరోనా రోగులతో కిక్కిరిసిన టిమ్స్.. ఆందోళనకరంగా పరిస్థితులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Tims: గచ్చిబౌలిలోని టిమ్స్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో ట్రీట్ మెంట్ పొందుతూ రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. దీంతో టిమ్స్ లో 8 ప్లోర్లలో కరోనా రోగులతో నిండిపోయాయి. టిమ్స్ లో మర్చురీ లేదు. దీంతో ఆసుపత్రి కారిడార్లలో, కొందరి డెడ్ బాడీలు ప్యాక్ చేసి స్ట్రెచర్‌లపై పడేస్తున్నారు. మరోవైపు పేషెంట్ల మరణవార్తను తమకు లేట్ గా చెబుతున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌తో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.  తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆసుపత్రిలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కొంతమంది డెడ్ బాడీలను ఆసుపత్రి ఆవరణలోనే ఉంచుతున్నారు. టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్) ఆసుపత్రిలో  బెడ్‌పై నుంచి కరోనా రోగులు పడిపోయినా కనీసం పట్టించుకోవడం లేదు. మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారు. అటు సిబ్బంది కూడా కరోనా బారిన పడుతుండటంతో తగినంత సిబ్బంది లేకపోవడం ఇబ్బందులకు గురవుతున్నారు.  14 అంతస్తుల టిమ్స్ లో 8  ఫ్లోర్లను మాత్రమే వాడుతున్నారు. ఆ ఎనిమిది అంతస్థులు కరోనా రోగులతో నిండిపోయాయి. మార్చురీ లేక మృతదేహాలను ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. కరోనాతో రోగి చనిపోయిన వెంటనే తమకు తెలియజేయడం లేదని కుబుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

  లెక్కలు దాచేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో కొందరి డెడ్ బాడీలు రెండ్రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటున్నాయి. ఒక ఫ్లోర్​ లో రెండు రోజులుగా డెడ్​ బాడీ తరలించకపోవడంతో ఐసీయూ మొత్తం వాసనతో నిండిపోయినట్లు తెలిసింది. ఆ ఫ్లోర్​లోకి ఎవరైనా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గడిచిన 10 రోజుల నుంచి టిమ్స్ లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతక ముందు రోజుకు ఆరుగురు కంటే తక్కువగా చనిపోయేవారు. ప్రస్తుతం దానికి మూడింతలు పెరగడంతో ఆసుపత్రిలో బెడ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా మరణాల్లో టిమ్స్ మరో గాంధీ హాస్పిటల్​గా ​మారుతోంది. చికిత్స పొందుతూ చనిపోయిన వారి శవాలను తరలించడంలో సిబ్బంది ఆలస్యం చేస్తున్నారు.

  తమ బంధువు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగేందుకు వెళ్తే మరణ వార్త చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మరుసటి రోజు సమాచారం ఇస్తున్నారని కొందరు అటెండర్లు వాపోతున్నారు. ఈ వార్తలు వింటున్న వారు.. దగ్గరుండి తమ బంధువును ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: 30 people die, Corona cases, Corona TIMS, Dead bodies, Gachibowli, Hydarabad, Treatment

  ఉత్తమ కథలు