HYDERABAD CORONA CASES HITS HARD IN RAJENDRANAGAR POLICE STATION THAT TOTAL 16 POLICE OFFICIALS DIAGNOSED WITH COVID POSITIVE PRV
Corona cases in Police station: పోలీసులపై వైరస్ ఎటాక్.. ఆ ఒక్క పోలీస్టేషన్లోనే 16 మందికి కరోనా పాజిటివ్.. అధికారుల అప్రమత్తం
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోలీస్, ఆర్టీసీ సిబ్బందితోపాటు సామాన్యులూ వరుసగా కరోనా (Corona) బారినపడుతున్నారు.
తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోలీస్, ఆర్టీసీ సిబ్బందితోపాటు సామాన్యులూ వరుసగా కరోనా (Corona) బారినపడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొవిడ్ తో ఆస్పత్రిలో చేరగా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హోం క్వారంటైన్ లో ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రెండోసారి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ప్రయాణికులంతా (passengers) టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి.
ఎస్సై, ఏఎస్సైతో పాటు..
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar Police station)లో విధులు నిర్వహిస్తున్న 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ (corona positive)గా నమోదవడం ప్రస్తుతం కలకలం రేపింది. ఎస్సై, ఏఎస్సైతో పాటు మరో 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. మాస్క్ లేకుండా ఎవ్వరూ కూడా పోలీస్ స్టేషన్లోకి రావొద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు దారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ ఆంక్షలు విధించారు.
భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీస్ సిబ్బందికి..
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముక్కోటి విధులకు భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ (Corona positive)గా నిర్థారణ అయింది. దీంతో స్టేషన్లో ఉన్న మిగతా సిబ్బందితో పాటు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా టెస్ట్‌లు చేయించుకుంటున్నారు.
తెలంగాణలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులతో పాటు కోవిడ్ కేసులూ మరోవైపు ఉధృతంగా నమోదవుతుండటంతో వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే వైద్యాధికారుల సూచనల మేరకు టీఎస్ గవర్నమెంట్ సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ జీఓ జారీ చేసింది.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజూకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,047 పాజిటివ్ కేసులు (Corona cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,057కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 1174 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కొవిడ్ టీకాల (Vaccination) పంపిణీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.