హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ మంటలకు ఆహుతి అయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే ఈలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు
వివరాల్లోకి వెళితే.... ఏపి చెందిన ఏసీ కంటైనర్ రోయ్యలతో లోడుతో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్దకు చేరుకున్న కంటైనర్ ఎదురుగా వస్తున్న మరోలారీని తెల్లవారుజామున బలంగా ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. దీంతో వెంటనే ఇంజిన్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్లో ఉన్న క్లీనర్‌తో పాటు కంటైనర్ డ్రైవర్ కూడ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇద్దరు క్యాబిన్ లోనే సజీవ దహనం అయ్యారు. కాగా మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూరజ్, మూర్తుజన్గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు..ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే లోపే ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Hyderabad