news18-telugu
Updated: December 3, 2019, 11:07 AM IST
తప్పతాగిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య
నలుగురికి రక్షణ కల్పించి.. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులు తప్పదారి పడుతున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ ఫూటుగా మద్యం సేవించి రోడ్డుపై వీరంగం సృష్టించారు. తప్పతాగి ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా రోడ్డుపై నాాన యాగీ చేశాడు. నడిరోడ్డుపై అడ్డంగా పడుకొని ప్రయాణికుల్ని,జనాన్ని భయబ్రాంతులకు గురి చేశారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్లేబుల్ ఈశ్వరయ్య రాత్రి డ్యూటీ చేయాల్సిన సమయంలో డ్యూటీ వదిలేశాడు. ఫుల్గా తాగి రోడ్డుపై వీరంగం సృష్టించడం. దీంతో ఈ ఘటన గురించి తెలుసుకున్న పై అధికారుల్ని అతడ్ని సస్పెండ్ చేశారు. పలక్నుమా సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఛార్జీ మెమో జారీ చేశారు సీపీ. ఈ ఘటనపై నగరవాసులు మండిపడుతున్నారు. పోలీసులే ఇలా తయారైతే.. ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ నుంచి వస్తుందని ? ప్రశ్నిస్తున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 3, 2019, 9:25 AM IST