Home /News /telangana /

HYDERABAD CONJOINED TWINS VEENA VANI ARE WRITING INTER EXAMS WITHOUT ANY COOPERATION SNR

Telanagan:పరీక్షల్లో ఎలాంటి సహకారం వద్దు..మెరిట్‌తోనే చార్టెడ్ అకౌంటెంట్స్‌ అవుతాం:వీణా,వాణి

(అవిభక్త కవలల గోల్)

(అవిభక్త కవలల గోల్)

Hyderabad:తలలు అతుక్కొని పుట్టిన కవలలు వీణా,వాణిలు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ బోర్డ్ ఇచ్చిన ప్రత్యేక ఏర్పాట్లను తిరస్కరించిన కవలలు..భవిష్యత్తులో చార్టెడ్ అకౌంటెంట్స్‌ కావాలన్న తమ గోల్‌ని మెరిట్‌తోనే సాధిస్తామంటున్నారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ (Telangana)కు చెందిన అవిభక్త కవలలు వీణా-వాణి(veena vani) మరోసారి తమ ఆత్మస్థైర్యాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో తాము ఏం కావాలనుకుంటున్నామో ...ఆ లక్ష్య సాధన కోసం స్వశక్తితోనే మందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. అవిభక్త కవలలు(Conjoined twins)గా పుట్టిన వీణా-వాణి ప్రస్తుతం ఇంటర్‌ బోర్డ్ ఎగ్జామ్స్‌(Inter Board Exams)రాస్తున్నారు. తలలు అతుక్కొని పుట్టిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏగ్జామ్స్‌ రాసేందుకు ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డ్‌ ప్రత్యేక సౌకర్యాలు కల్పించినప్పటికి వాటిని ఈ ఇద్దరు కవలలు సున్నితంగా తిరస్కరించారు. ఈనెల 6వ తేదిన ప్రారంభమైన ఇంటర్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్నారు వీణా-వాణి. ఇంటర్‌ ఎగ్జామ్స్ రాస్తున్న వీణా-వాణిలు అందరికి స్టూడెంట్స్‌ మాదిరిగానే ఎవరి సహకారం లేకుండానే పరీక్షలు రాస్తున్నారని ఎగ్జామ్‌ ఇన్విజిలెటర్స్ (Invigilators)చెబుతున్నారు. ఐదు నిమిషాల ముందే ఎగ్జామ్‌ ముగిస్తున్నారు. అయితే ఇద్దరి తలలు అతుక్కొని ఉండటం కారణంగా ఎగ్జామ్స్‌లో ఒకరికొకరు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ చేసుకుంటున్నారా అని అధికారులు వేసిన ప్రశ్నలకు వీణా, వాణి ఒకే సమాధానం ఇచ్చారు. అలాంటిది లేదని ..తాము ఒకరితో మరొకరు పోటీ పడి చదువుతున్నామని...పరీక్షలు కూడా అలాగే రాస్తున్నామని చెప్పుకొచ్చారు.ఈ ఇంటర్ ఎగ్జామ్స్‌ రాసి మంచి మార్కులతో పాస్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.

అంతులేని ఆత్మవిస్వాసం..
భవిష్యత్తులో చార్టెడ్ అకౌంటెంట్స్‌ కావాలన్న తమ గోల్‌ని రీచ్ అవుతామని చెబుతున్నారు వీణా-వాణి. తమకు ఎలాంటి రిజిర్వేషన్ అవసరం లేదని కేవలం మెరిట్‌తోనే ఉత్తీర్ణత సాధిస్తామంటున్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తికాగానే 12వ తేదీ తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరి చార్టర్డ్ అకౌంటెంట్‌ కోసం ప్రివేర్ అవుతామంటున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతలకు2003లో తలలు అతుక్కొని పుట్టిన ఇద్దరు కవలలు..అప్పటి నుంచి వారికి దూరంగా 12సంవత్సరాల వరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్‌ హోమ్‌లో గడుపుతున్నారు. తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధు, మిత్రులను వదిలి ఉంటున్న ఈ సిస్టర్స్‌ ప్రస్తుతం ఇంటర్‌ ఎగ్జామ్స్ అక్కడి నుంచి రాస్తున్నారు.

(స్వశక్తితోనే ఎదుగుతాం)


చార్టెడ్‌ అకౌంటెంట్స్ కావాలని గోల్..
వీణా,వాణి. ఇద్దరి తలలోని నరాలు కలిసిపోయి ఉండటంతో వీరిని వేరు చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి తోడు డబ్బు ఖర్చు చేసి విదేశాల్లో ఆపరేషన్ చేయించే శక్తి తల్లిదండ్రులకు లేకపోవడంతో ప్రభుత్వం వీణా-వాణికి ఆపరేషన్ చేయించే బాధ్యతల్ని తీసుకుంది. దాంతో వాళ్లను స్టేట్‌ హోమ్‌లో ఉంచి చదివిస్తోంది. స్టేట్ హోంలో వీణావాణిలకు పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ ఓ టీచర్‌ను నియమించింది.

వాళ్లే ఆత్మీయులు..
ఆయాలు, కేర్ టేకర్‌లనే పేరెంట్స్‌గా, బంధువులుగా భావిస్తున్నామని వీణా-వాణి పలుమార్లు వారి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వెల్లడించారు. పుట్టుకతోనే తల్లిదండ్రుల్ని వదిలి ఆసుపత్రిలో పెరిగినప్పటికి వాళ్లలో ఆత్మస్థైర్యం మాత్రం బలంగా ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana, TS Inter Exams 2022, Veena Vani

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు