హైదరాబాద్ డ్రగ్స్ కేసు (Hyderabad pub drugs)లో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్బు (Radisson blu Pub)పై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారు. అయితే, ఈ పబ్ కాంగ్రెస్ (congress) సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి (renuka chowdhury) కూతురు తేజస్వినీది అంటూ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు.
విచారించారని కూడా ప్రచారం చేశాయి..
ఆమె ఏమన్నారంటే.. " హైదరాబాద్లోని రాడిసన్ బ్లూ (Radisson blu Pub) హోటల్ లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ బార్ పై పోలీసులు దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ మా అమ్మాయి తేజస్విని చౌదరిదని పేర్కొన్నాయి. అంతేకాదు, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని, విచారించారని కూడా ప్రచారం చేశాయి. దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కు మా అమ్మాయి తేజస్విని యజమాని కాదు. అసలు ఆ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు.
పైగా, పోలీసులు దాడులు చేసిన ఏప్రిల్ 2వ తేదీన మా అమ్మాయి తేజస్విని ఆ పబ్ లో లేనేలేదు. అలాంటప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం, ప్రశ్నించడం జరగని పని. ఈ సందర్భంగా నేను మీడియా సంస్థలను కోరేదేమిటంటే... కనీస పాత్రికేయ విలువలు పాటించండి. వార్తలు ప్రసారం చేసేముందు వాస్తవాలు నిర్ధారించుకోండి. మీ సంచలనాత్మక కథనాల కోసం ప్రైవేటు వ్యక్తుల పేర్లను బయటికి లాగే ప్రయత్నం చేయొద్దు" అంటూ రేణుకా చౌదరి హితవు పలికారు.
45 మంది అరెస్టు..
అయితే, తొలుత 144 మందిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చినా, అరెస్టయింది 45 మందే అని, మిగతా వారికి నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Police Commissioner CV Anand) తెలిపారు. డ్రగ్స్ వ్యవహారం సంచలనం కావడంతో సీవీ ఆనంద్ (cv anand) .. పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్సైలు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్‌లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs case, Hyderabad, Renuka chowdhury