తెలంగాణ (Telangana)లో గత కొన్ని రోజులుగా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత (CM KCR) వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai soundararajan) మధ్య దూరం పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. దీనికి స్పష్టమైన సమాధానం రాకపోయినా.. అవుననే రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల ముందే గవర్నర్ తమిళిసైకి మేడారం జాతరలో మంత్రులు స్వాగతం పలకడానికి రాకపోవడం చర్చనీయాంశం అయింది. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేను కలవడానికి వెళ్లే ముందు కేసీఆర్ బీజేపీకి జలక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లో (Telangana assembly) గవర్నర్ ప్రసంగం లేకుండా జరగడం చర్చనీయాంశమైంది. అయితే ఇపుడు ఈ వివాదాలకు ఉగాది వేడుక కూడా కేంద్ర బిందువైంది.
రాజ్‌భవన్‌కు దూరంగా కేసీఆర్..
ఉగాదిని (Ugadi celebration) పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఈ కార్యక్రమానికి దూరంగా వున్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వేడుకల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ.. వారెవ్వరూ హాజరు కాలేదు. ఎమ్మెల్యే జయ్ పాల్ యాదవ్ మాత్రమే పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC chief Revanth reddy) తదితరులు హాజరయ్యారు.
రిపబ్లిక్ డే వేడుకల్లోనూ..
అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో గవర్నర్ విషయంలో పెద్దగా వ్యతిరేకత లేదన్నది పలువురి వాదన, కానీ, ఇటీవలె ఎమ్మెల్సీల ఎంపిక సమయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొంత తాత్సారం చేసిన సంగతిని టీఆర్ఎస్ శ్రేణులు గుర్తుచేస్తున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్, సీఎం కార్యాలయం మధ్య దూరం పెరుగుతున్నదని రాజకీయాల్లో చర్చ జరగడానికి రిపబ్లిక్ డే వేడుకలు కేంద్ర బిందువుగా మారాయి. రాజ్‌భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవరూ హాజరు కాలేదు. మేడారంలోనూ అదే జరిగింది. ఇక బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురవనున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ తమిళిసైకి మంత్రులు స్వాగతం పలకలేదు. దీంతో బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లకు, సీఎంలకు మధ్య అంతగా సఖ్యత లేదు. దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వ్యాఖ్యానించారు. కేంద్రం గవర్నర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకుంటోందని ఆరోపణలు సైతం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.