మదర్స్ డే ముందు రోజే మర్డర్..
తెల్లారితే మాతృదినోత్సవం. అంతకు ముందు రోజే ఇంతటి దారుణం జరగడంపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భూదేవి హత్య జరిగిన సమయంలో దత్తపుత్రుడు సాయిచరణ్ ఇంట్లో లేకపోవడంతో అతనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడనే అనుమానాలు బలపడుతున్నాయి. అలాగే భూదేవితో వేరే వ్యక్తులకు ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని స్థానికులు చెబుతున్నమాట. దుండగులు, గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో..కచ్చితంగా ఇది ఇంట్లో ఉంటున్న దత్తపుత్రుడు సాయిచరణ్ చేసిన దారుణంగానే భావిస్తున్నారు. ఇంట్లోని 30తులాల నగలతో పాటు క్యాష్‌ని ఎత్తుకెళ్లాడు సాయితేజ.
దత్త పుత్రుడే హంతకుడు..
దత్తత తీసుకొని కన్నకొడుకులా చూసుకుంటున్న భూదేవిని సాయితేజ డబ్బు, నగల కోసమే హతమార్చాడనే వార్తను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. నమ్మద్రోహమే కాదు..చివరకు రక్తసంబంధంగా ముడిపడిన తల్లి,కొడుకుల బంధాన్ని కేవలం డబ్బు, నగల కోసం ఎలా తెంచుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సరూర్‌నగర్ పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు చేపట్టామని..త్వరలోనే భూదేవి హత్యకు కారకులైన వారిని తప్పని సరిగా పట్టుకొని కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Women died