హోమ్ /వార్తలు /తెలంగాణ /

Prithviraj:పొగడ్తల వెనుక పరమార్ధం అదేనా..? అమ్మ నా బత్తాయో..

Prithviraj:పొగడ్తల వెనుక పరమార్ధం అదేనా..? అమ్మ నా బత్తాయో..

(పొగడ్తల వెనుక పరమార్ధం)

(పొగడ్తల వెనుక పరమార్ధం)

Prithviraj: కమెడియన్ పృధ్వీరాజ్‌ స్వరం మారింది. భీమ్లానాయక్ ముందు వరకు పవన్‌ కల్యాణ్ పేరు ప్రస్తావించని కమెడియన్..ఇప్పుడు ఆకాశానికి ఎత్తడంపై పెద్ద చర్చ జరుగుతోంది. పృధ్వీరాజ్ వైసీపీని వదిలి జనసేనలోకి జంప్‌ అవుతారా ఏంటీ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా చదవండి ...

టాలీవుడ్‌ కమెడియన్ (Comedian)పృద్వీరాజ్‌( Prithviraj)ఫ్యూచర్‌ పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌ని ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటున్నట్లుగా ఉంది. గత ఎన్నికల టైమ్‌లో వైసీపీ (ycp) కీలకనేత ఓ వెలుగు వెలిగారు. తాడేపల్లిగూడెం(Thadepalligudem)లో ఓటమి, రాసలీల ఆడియో టేపులతో వైసీపీలో గౌరవంతో పాటు పదవిని పోగొట్టుకున్నారు. ఆ ఎఫెక్ట్‌తోనే పృధ్వీరాజ్‌ వైసీపీలో ఫేడవుట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఆ రెండు పరిణామాలే ఆయన పొలిటికల్‌ లైఫ్‌ని బాగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే పాలిటిక్స్‌లో ఫెయిల్‌ అయినప్పటికి కమెడియన్‌గా అడపాదడపా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నారు పృధ్వీరాజ్. రీసెంట్‌గా జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ Pawan Kalyanభీమ్లానాయక్ Bheemlanayakమూవీపై పృధ్వీరాజ్‌ స్పందించిన తీరు, ఓ టాలీవుడ్‌ హీరోని దేవుడితో పోల్చడాన్ని అభిమానులు వేరేలా అర్ధం చేసుకుంటున్నారు. ప్రజల్లో పవన్‌ కల్యాణ్‌పైన ఉన్న అభిమానం, క్రేజ్‌ మరెవరికి లేదనడం చూస్తుంటే కచ్చితంగా పృధ్వీరాజ్‌ టెంట్‌ మార్చుతారా ఏంటీ అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటరత్న ఎన్టీఆర్‌(Senior NTR) తర్వాత అంతటి క్రేజ్ ఒక్క పవన్‌కల్యాణ్‌కే దక్కిందంటూ చెప్పడం చూస్తుంటే పృధ్వీరాజ్‌ తన రాజకీయ భవిష్యత్తును రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున సీటు కోసం చేస్తున్న ప్రయత్నమే కావచ్చనే సందేహాలు కలుగుతున్నాయి.గత ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీ ఉంది. ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు కూడా పృధ్వీరాజ్‌ సినిమాల్లో ఉన్నారు..రాజకీయాల్లో వైసీపీ కండువ కప్పుకొని స్పీచ్‌లు ఇవ్వడం, జగన్‌ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. పృధ్వీరాజ్‌ కమిట్‌మెంట్‌ని వైసీపీ గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఓడిపోతే నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ, జగన్‌ గురించి ఎంతో గొప్పగా మాట్లాడే పోసాని కృష్ణమురళి కంటే అధిక ప్రాధాన్యతనే ఇచ్చిందని చెప్పాలి.

పొగడ్తల వెనుక పరమార్ధం ..

వైసీపీలో గుర్తింపు అయితే దక్కింది కాని ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగా రాలేదు. పృధ్వీరాజ్‌ ఓడిపోయినప్పటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన్ని ఎస్వీబీసీ ఛానల్‌కి ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. ఆ పదవిలో రాసలీల ఆరోపణలు గట్టిగా రావడంతో పృధ్వీరాజ్‌ కుర్చి వదులుకోవాల్సి వచ్చింది. ఇంత పరాభవం జరిగిన తర్వాత వైసీపీ నేత పృధ్వీరాజ్‌ కంటే కమెడియన్‌ పృధ్వీరాజ్‌గానే ఎక్కువగా చలామణి అవుతూ వచ్చారు. ఈ గ్యాప్‌లోనే పృధ్వీరాజ్‌కు, వైసీపీ మధ్య గ్యాప్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది వైసీపీ వాళ్లు ఆయన్ని దూరం పెట్టారా లేక వైసీపీ అధినాయకత్వంతో పృధ్వీరాజే డిస్టెన్స్‌ మెయిన్‌టెన్ చేస్తున్నారా అన్న దానిపై క్లారిటీ లేదు.

బత్తాయ్‌ మనసులో ఏముంది ..

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. సినిమాల్లో చిన్న, చితక పాత్రలతో సరిపెట్టుకుంటున్న పృధ్వీరాజ్‌ ఫోకస్‌ మళ్లీ పాలిటిక్స్‌పై పడిందని క్రిటిక్స్ చెబుతున్న మాట. పవన్‌ కల్యాణ్‌ ఆప్తమిత్రుడైన అలీ వైసీపీలో చేరడం, పరిశ్రమకు చెందిన వాళ్లెవరూ పవన్‌ పక్కన రాజకీయాల్లో లేకపోవడంతో తనను అక్కున చేర్చుకుంటారనే చిన్న ఆశతోనే పృధ్వీరాజ్‌ ఇప్పటి నుంచే పవర్‌స్టార్‌ని పొగడటం, దేవుడితో పోల్చడం వంటివి చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. పృధ్వీరాజ్‌ మనసులో ఏముందో అనే విషయం జనసేన గ్రహిస్తుందా లేక ఈలోపే థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఆర్టిస్ట్ తన ఓపినియన్‌ని జనసేనాని పవన్ కల్యాణ్‌ చెవిలో పడేస్తారా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.

Published by:Siva Nanduri
First published:

Tags: Comedian prudvi raj, Pavan kalyan, Ys jagan

ఉత్తమ కథలు