HYDERABAD COCK BETTING GANG ARRESTED IN HYDERABAD TDP MLA CHINTAMANENI ESCAPED INVOLVED IN THAT SCAM PAH
హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు.. అడ్డంగా దొరికిపోయిన మాజీ టీడీపీ ఎమ్మేల్యే చింతమనేని, పలువురు వీఐపీలు..
చింతమనేని ప్రభాకర్ (ఫైల్)
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో భారీ ఎత్తున కోళ్ల బెట్టింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బెట్టింగ్ స్థలానికి వెళ్లారు. అక్కడ ఉన్న వారిని, కట్టల కొద్ది డబ్బులను చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు.
హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలో కోడిపందాలు, బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు తమ సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. ఈ క్రమంలో... అక్కడ టీడీపీ మాజీ మాజీ టీడీపీ ఎమ్మేల్యే చింతమనేని, మరికొంత మంది విఐపీలు ఉన్నారు. ఈ క్రమంలో.. వారంతా పోలీసులను చూడగానే తలోదిక్కున పారిపోయారు. కాగా, చింతమనేని పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు దాదాపు.. 20మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారు.
దాదాపు.. లక్షల్లో డబ్బులో కట్టలను స్వాధీనంచేసుకున్నారు. ఈ ఘటన పెదకంజర్ల గ్రామంలో ఓతోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. గత కొంత కాలంగా చింతమనేని (Chintamaneni prabhakar) గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నాడు. దీంతో పోలీసులు నిఘాపెంచారు. ఈ క్రమంలో.. పటాన్ చెరువు డీఎస్పీ భీం రెడ్డి ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనిలో సంచుల నిండి నగదు, కోళ్లు, 21 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా, 26 వాహనాలను, 32 పందెం కోళ్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ సూఫీగురువు దారుణ హత్యకు గురయ్యారు.
మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్‌లో దారుణ ఘటన జరిగింది. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల ముస్లిం ఆధ్యాత్మిక గురువు.. సయ్యద్ చిస్తీ గత కొంత కాలంగా నాసిక్ లో ఉంటున్నారు. అక్కడ ప్రజలకు మతం పట్ల బోధనలు (Muslim Spiritual Leader) చేస్తుండేవారు. ఈ క్రమంలో బుధవారం ఆయన దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సయ్యద్ చిస్తీ నాసిక్‌లోని యోలా పట్టణంలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ఆయనను చుట్టుపక్కల ఉంటే ప్రజలు ఎంతో విశ్వసిస్తారు. ఆయన ముంబై పట్టణానికి 200 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో హత్యకు గురయ్యాడు. ఆయన డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు పోలీసులకు తెలిపారు.
ఆయన తలపై బుల్లెట్ గాయాలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. సయ్యద్.. ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు కావడం వలన భూములు కొనలేక పోయాడు. దీంతో స్థానికుల పేరు మీద భూములు కొనుగోలు చేశారని పలువురు అనుమానిస్తున్నారు. భూములకు సంబంధించిన లావాదేవీల గొడవల వలన డ్రైవర్ హత్య చేసి ఉండోచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికలంగా తీవ్ర కలకలంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.