హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | BATUKAMMA: తెలంగాణతో పాటు 8దేశాల్లో బతుకమ్మ సంబురాలు .. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

CM KCR | BATUKAMMA: తెలంగాణతో పాటు 8దేశాల్లో బతుకమ్మ సంబురాలు .. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

kcr batukamma wishes

kcr batukamma wishes

CM KCR | BATUKAMMA: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగానే రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)బతుకమ్మ (Bathukamma) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం(Sunday) నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగానే రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సిఎం తెలిపారు.

BJP vs Trs : మీటర్‌పై కామెంట్‌తో కోమటిరెడ్డి మ్యాటర్ పేలిపోతుందా ..? లేక తేలిపోతుందా..?

బతుకులు చల్లంగా ఉండాలని..

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు తెలంగాణ సంస్కృతికి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం కోటి మందికిపైగా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తూ గౌరవించు కుంటున్నామని సీఎం కేసీఆర్ ఈసందర్భంగా తెలిపారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సిఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సిఎం కేసీఆర్ ప్రార్థించారు.

విదేశాల్లో బతుకమ్మ సంబురాలు..

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏటా బతుకమ్మ వేడుకలను రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో సైతం నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈసంవత్సరం యూకే, ఖతార్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బహ్రయిన్, కువైట్, దుబయ్, స్విట్జర్ల్యాండ్ వంటి ఎనిమిది దేశాలతో పాటు ముంబైలో కూడా ఘనంగా నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేసింది.

తెలంగాణ సంస్కృతికి పెద్దపీట..

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకల పోస్టర్‌లను టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bathukamma 2022, CM KCR, Telangana News

ఉత్తమ కథలు