Home /News /telangana /

HYDERABAD CM KCR WAS UNANIMOUSLY ELECTED AS THE TRS PRESIDENT ONCE AGAIN AND CM KCR SPEECH AT TRS PLEANARY 2021 VB

TRS President CM KCR : చిల్లర రాజకీయాలు చేయొద్దు.. త్వరలోనే ఆ పథకాన్ని విస్తరిస్తాం.. సీఎం కేసీఆర్..

జెండా ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్

జెండా ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్

TRS President CM KCR : హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

ఇంకా చదవండి ...
  హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అమరవీరులను స్మరించుకున్నారు. 20 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తమతో అనేక మంది కలిసి పనిచేశారని అన్నారు. కీర్తి శేషులైన పార్టీ నాయకులకు ప్లీనరీ సంతాపం తెలిపింది. అమరులకు ప్రతినిధుల సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్‌ తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  ఈ మేరకు ప్లీనరీ వేదికగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. 2001, ఏప్రిల్ 27 స్వ‌ర్గీయ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ్ర‌యం జ‌ల‌దృశ్యం ఆవ‌ర‌ణ‌లో ఈ గులాబీ ప‌తాకాన్ని ఆవిష్క‌రించాము. ఆనాడు విప‌రీత‌మైన అప‌న‌మ్మ‌క స్థితి. గ‌మ్యం మీద స్ప‌ష్ట‌త లేన‌టువంటి అగ‌మ్య గోచ‌ర ప‌రిస్థితి. ఉద్య‌మం మీద అప్ప‌టికే ఆవ‌రించుకున్న అనుమానాలు, అపోహాలు, దుష్ప్ర‌చారాలు.. ర‌క‌ర‌కాల అనుమానాస్ప‌ద‌స్థితుల మ‌ధ్య గులాబీ జెండా ఎగిరింది.

  Huzurabad By Elections: షాకిస్తున్న సర్వేలు.. అనూహ్యంగా మారుతున్న సమీకరణాలు.. ఆ అభ్యర్థికి ఓటమి తప్పదా..?


  20 సంవ‌త్స‌రాల ప్ర‌స్థానం త‌ర్వాత మ‌ళ్లీ ఒక‌సారి అద్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టివ‌ల్సిందిగా, ఏగ‌క్రీవంగా న‌న్ను ఎన్నుకున్నందుకు హృద‌య‌పూర్వక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తునన్నారు సీఎం కేసీఆర్. అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, మ‌న ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు మాత్ర‌మే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుంద‌ని కేసీఆర్ అన్నారు.  టీఆర్ఎస్ కు బాసులు ఎవరూ లేరని.. కేవలం ప్రజలు మాత్రమే టీఆర్ ఎస్ కు బాసులు అంటూ ఉపన్యాసంలో పేర్కొన్నారు.

  Huzurabad దెబ్బ : 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ! -రహస్య భేటీపై రచ్చ రచ్చ


  వారి అవసరాలు, డిమాండ్లే అజెండాగా ముందుకు సాగుతున్నామంటూ తెలిపారు.  అనేక ర‌కాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని... స‌మైక్య‌వాదులు అనేక అడ్డంకులు సృష్టించారు.. చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. వేయ‌ని నింద‌లు లేవు.. పెట్ట‌ని తిప్ప‌లు లేవు..  చివ‌రికి రాజ్య‌స‌భ‌లో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్ర‌య‌త్నించారన్నారు సీఎం కేసీఆర్. మ‌నం కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబ‌ట్టి విజ‌య‌తీరాల‌కు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

  Telangana RTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. వివరాలివే


  తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌కు కొత్త బాట‌ను చూపాయి. చ‌రిత్ర‌లో తెలంగాణ ఉద్య‌మానికి, ఉద్య‌మ‌కారుల‌కు శాశ్వ‌తంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళిత బంధుపై పెడుతున్న పెట్టుబడి రూ.లక్షా 70 వేల కోట్లు అంటూ చెప్పారు. దళిత బంధు పథకం గురించి ఏపీ నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. త్వరలోనే రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలియజేశాడు. మరోవైపు ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పార్కింగ్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  అలాగే ప్లీనరిలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు చేయనుంది. కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలి. అసెంబ్లీ చేసిన తీర్మానంపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదు… కేంద్రం దిగి వచ్చే వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. బీసీలకి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ల పెంపుదల కోసం చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి.

  సమైఖ్య స్ఫూర్తి నిలబెట్టాలి. విభజన హామీలు నెరవేర్చాలి. ఐటీఐఆర్ ,బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ, వరంగల్ లో రైల్వే కోచ్ ప్యాక్టరి ఏర్పాటు చేయాలి. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలి వంటి తదితర తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నారు.

  హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలకు ఒకచోట, కార్యకర్తల వాహనాలకు మరోచోట పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే హైటెక్స్‌ పరిసరాలలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

  శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి హరీశ్ రావు..
  ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ గారు అని.. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టిఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి మన కేసీఆర్ , ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ అభివృద్ధి , సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలన దక్షుడు మన కేసీఆర్ గారు కొనియడిన మంత్రి హరీష్ రావు, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో , ప్రజల ఇంటి పార్టీ గా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో సారి టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీ కేసీఆర్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Brand Hyderabad, CM KCR

  తదుపరి వార్తలు