HYDERABAD CM KCR VISIT TO HALIYA TOMRROW TO REVIEW OF DEVELPING WORKS VRY
cm kcr : హమీల అమలే ఎజెండా... సోమవారం హలియాకు సీఎం కేసిఆర్
సీఎం కేసీఆర్
cm kcr : హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఆయన సోమవారం ఉదయం పది గంటలకు ప్రగతి భవన్ నుండి బయలుదేరి హలియా చేరుకోనున్నారు.
అనంతరం అక్కడ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించనున్న సమావేశానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడే ఉండి ఎమ్మెల్యే భగత్ నివాసంలో లంచ్ చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల సంధర్బంగా సీఎం కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతోంది.. ఎన్నికల కోసం ఆయన ఎలాంటీ వాగ్దానాలైన చేస్తారని ఆ తర్వాత వాటిని పక్కన పెడతారని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో హుజూరాబాద్‌లో ఇచ్చే హామీలు కూడా ఇదేవిధంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం దళిత బంధు పథకం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
దీంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించిన నాగార్జున సాగర్ నియోజకవర్గంపై దృష్టి సారించారు..ఆయన ఇచ్చిన హామీలపై ప్రగతిభవన్ నుండే సమీక్షించే అవకాశాలు ఉన్నా.. సీఎం నేరుగా నియోజకవర్గానికే వెళుతున్నారు.. ఆక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో తాను ఇచ్చిన హామీలపై నియోజకవర్గంలోనే సమీక్షించనున్నారు. . అందుకే ఆయన సాగర్ టూర్ కు రెఢి అయినట్టు సమాచారం.ఈ టూర్ తర్వాత తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్దితో పనిచేస్తాననే సంకేతాలను హుజూరాబాద్ ఓటర్లకు ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
కాగా నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10న సీఎం కేసీఆర్ హాలీయా బహిరంగ సభలో పాల్గోని అనేక హామీలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయలు, మండల కేంద్రానికి 30 లక్షలు, ఇక నల్గోండ మున్సిపాలిటికి 10 కోట్లు మిర్యాలగూడ మున్సిపాలిటికి 5 కోట్లు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు కోటి రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు పలు అభివృద్ది పనులు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా వీటన్నింటీపై నేరుగా నియోజకవర్గ నాయకులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. కాగా ఉప ఎన్నికల తర్వాత గెలిచిన నోముల భగత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.కాని సీఎం మాత్రం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సారి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన ఇంట్లోనే భోజనం చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.