హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: ‘‘ మళ్లీ పాత తెలంగాణ అయితది.. బతుకులు ఆగం అయితయ్​ ’’: సీఎం కేసీఆర్​

CM KCR: ‘‘ మళ్లీ పాత తెలంగాణ అయితది.. బతుకులు ఆగం అయితయ్​ ’’: సీఎం కేసీఆర్​

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

మత ఉచ్చులో పడి ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని తెలంగాణ సీఎం కేసీఆర్​ అన్నారు. మోస పోతే గోస పడుతామని అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మత (Religion) ఉచ్చులో పడి, ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​ అన్నారు.  మోస పోతే గోస పడుతామని అన్నారు. రంగారెడ్డిలో (Ranga reddy) జరిగిన కలెక్టర్​ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. కేంద్రం, బీజేపీల తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘మేధావులు, యువకులను కోరుతా ఉన్న..  ఒక వంద సంవత్సరాలు తెలంగాణ ఆగం అయితది, దేశం ఆగం అయితది, అనురాగంతో ఉండే దేశం బాగుపడుతది కానీ, కోపంతో ఆవేశంతో ఉంటే  ఏ దేశం బాగుపడది”అని కేసీఆర్​ అన్నారు. మనకు శాంతి యుత తెలంగాణ కావాలని ఆయన ఆకాక్షించారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోని భారతదేశానికే తెలంగాణ  (Telangana) ఆదర్శంగా ఉండాలని కేసీఆర్​ (CM KCR)​ అన్నారు. ఎనిమిదేళ్లయినా మోదీ ఏం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం భారతదేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు కేసీఆర్​. సమాజంలో చీలికలకు పాల్పడేవారికి, ప్రభుత్వాలు కూలగొట్టేవారికి ఈ దేశంలో స్థానం లేదని కేసీఆర్​ అన్నారు.


  ‘‘మోదీ (Modi) ఎందుకు ఆగం అవుతున్నవ్​.. ఉన్న పదవి చాలదా? బిహార్​లో ఏం జరుగుతోంది? బెంగాల్​లో ఏం జరుగుతోంది? అని ప్రశ్నించారు కేసీఆర్​. హైదరాబాద్​ (Hyderabad)లో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతోందని కేసీఆర్​ అన్నారు. ఈ దుర్మార్గులు, ఈ చిల్లరగాళ్లు ఏం చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలి? నేను బతికి ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను, దీన్ని కాపాడటానికి నా సర్వ శక్తులా పోరాడతా”అని అన్నారు.  రంగారెడ్డి జిల్లాకు కొత్త‌గా చ‌క్క‌టి స‌మీకృత ప‌రిపాల‌న భ‌వనాన్ని నిర్మించి ప్రారంభించినందుకు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని సీఎం  (CM KCR)​ పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో రంగారెడ్డి జిల్లాలో అనేక ర‌కాల త‌ప్పుడు ప్ర‌చారాలు చేశారు. భూములు ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని, రాష్ట్రం వ‌స్తే లాభం ఉండ‌ద‌ని చెప్పారు. మన‌కు క‌రెంట్, మంచినీరు ఇవ్వ‌ని వారు మ‌న‌ల్ని గోల్ మాల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.


  ప‌ట్టుద‌ల‌తో 14 ఏండ్లు పోరాడితే చాలా త్యాగాల త‌ర్వాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొత్త జిల్లాల‌ను సాధించుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. మీ గ్రామాల్లో అంద‌రితో చ‌ర్చ పెట్టాలి. ఒక్క‌టే ఒక్క మాట మ‌నవి చేస్తున్నా. ఏ స‌మ‌యంలో గానీ, పురాణం, చ‌రిత్ర చ‌దివినా.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసే మేధావులు, యువ‌త నిద్రాణ‌మై ఉంటారో.. వాళ్లు చాలా బాధ‌లు అనుభ‌విస్తారు.


  మ‌న చ‌రిత్ర‌నే మ‌న‌కు మంచి ఉదాహ‌ర‌ణ‌..


  మ‌న సొంత చ‌రిత్ర‌నే మ‌న‌కు మంచి ఉదాహ‌ర‌ణ‌. స్వ‌తంత్ర భార‌త‌దేశంలో హైద‌రాబాద్ స్టేట్‌గా ఉన్నాం. ఆ త‌ద‌నంత‌రం నాటి నాయ‌క‌త్వం ఏమ‌రుపాటుగా ఉంటే మ‌నం ఏపీలో భాగ‌మ‌య్యాం. అనేక బాధ‌లు ప‌డ్డాం. ఉద్య‌మ స‌మ‌యంలో అనేక స‌భ‌ల ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేశాం. ఏపీ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు 1969లో జ‌రిగిన ఉద్య‌మంలో 400 మంది పిల్ల‌లు బ‌ల‌య్యారు. మ‌లిద‌శ ఉద్య‌మంలో అనేక మంది చ‌నిపోయారు. అహింసా ప‌ద్ధ‌తిలో ముందుకు పోయిప్ప‌టికీ అనేక బాధ‌లు అనుభ‌వించాం.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hyderabad, Rangareddy

  ఉత్తమ కథలు